– ఇల్లు, డబ్బు, చదువుతో చిన్నారికి న్యాయం జరిగేనా..!
– కన్న ప్రేమ.. ప్రలోభాలకు లొంగిపోయిందా..?
– విజయవాడ చిన్నారి ఆత్యాచార ఘటనపై ఎన్నో చిక్కు ముడులు
– నిందితుడి అచూకి తెలిపేందుకు అసక్తి చూపని పోలీసులు
– స్థానికంగా ఉండే ప్రజలను బెదిరింపులకు గురిచేస్తున్న నిందితుడి కుటుంబ సభ్యులు
– వివరణ అడుగగా చిరునవ్వు చిందిస్తున్న పోలీసులు
– తమ పరిధిలోని ఆంశం కాదని తేల్చిచెప్పిన పోలీసులు
– న్యాయం జరిగి తీరాలంటూ బాధిత కుటుంబానికి అండగా స్థానికులు
– స్థానిక ఎమ్మెల్యే పరామర్శకు వస్తేనే మిగతా వైసీపీ నాయకులు వస్తారా..?
విజయవాడ, (జనస్వరం) : రెండు రోజుల క్రితం విజయవాడ నడిబొద్దున తొమ్మిదేళ్ల చిన్నారిపై ఆరవై ఏళ్ల కామాంధుడు ఆత్యాచార ఘటనకు పాల్పడిన సంగతి తెలిసిన విషయమే. ఈ ఘటనతో విజయవాడ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడి౦ది. నిందితుడిని స్థానికులు ఆదివారమే పోలీసులకు అప్పగించినప్పటికి సోమవారం రాత్రికి కానీ కేసు నమోదు చేయకపోవటం గమనార్హం. ఇదిలా ఉంటే స్థానికంగా ఉండే ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు సైతం పరామర్శకు వెళ్లకపోవడం ప్రజలను అలోచింపజేస్తుంది. ఇదిలా ఉంటే మంగళవారం విజయవాడ పాత ప్రభుత్వ అసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పరామర్శకు ఆలస్యంగా రావటం వెనుకు కారణం ఏంటని స్థానిక ప్రతినిధులు తెలుసుకునేందుకు ప్రయత్నించగా సొంత పనిమీద హైదరాబాద్ వెళ్లినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మీ ఇంటికి కొద్ది దూరంలోనే సంఘటన చోటు చేసుకుంది. కానీ, దీనిపై మేయర్ కనీస స్పందించనులేదు. అయితే మంగళవారం ముకుమ్ముడి పాత ప్రభుత్వ అసుపత్రికి చేరుకుని చిన్నారి తల్లిదండ్రులకు ఇల్లు, డబ్బు, చదువు అనే ప్రలోభాలను ఆశ చూపి ఘటనను పక్కదారి పటేలా చేశారని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. సోమవారం వరకు తన బిడ్డకు న్యాయం జరిగాలని పోరాడిన.. మంగళవారానికి ప్రభుత్వం అన్ని విధాలా అదుకుంటుందని హామీ ఇచ్చారని చెప్పటం స్థానికులను విస్తుపోయేలా చేస్తుంది. అలాగే నిందితుడిని ఏ స్టేషన్‌లో పెట్టారు..? వారి కుటుంబ సభ్యుల స్పందన ఏంటి..? స్థానికంగా ఉండే ప్రజలను బెదిరింపులకు గురి చేస్తున్న కుటుంబ సభ్యులపై ఏ రకమైన చర్యలు తీసుకున్నారు..? అనే విషయంపై పోలీసులను వివరణ కోరగా చిరునవ్వులు చిందిస్తూ అది తమ పరిధిలో ఉండే అంశం కాదని తేల్చిచెప్పి వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికి బాధిత కుటుంబానికి అండగానే ఉంటామని వారు ధైర్యంగా ముందుకు వచ్చారు. నిందితుడికి మాత్రం కఠినంగా శిక్షించాలని, వారు ఉంటున్న ఇంటిని తక్షణమే ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు. దీనికి పోలీసులు స్పందిస్తూ రెండు, మూడు రోజుల్లో ఇళ్లు ఖాళీ చేయిస్తామని, నిందితుడికి శిక్ష అయితే తప్పదని హామీ ఇచ్చారు. చిన్నారికి జరిగిన అన్యాయం ప్రలోభాలతో న్యాయం జరుగుతుందో లేదో వేచి చూడాలి.