చిత్తూరు జిల్లా గంగాధర నియోజకవర్గం కార్వేటినగరం మండలంలో జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ పొన్నా యుగంధర్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి కనుసన్నల్లో జరిగిన ఇళ్ల స్థలాల పంపిణీ లో భారీ స్థాయిలో అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు. అనంతరం బడుగు బలహీన వర్గాలకు పేదలకు ఇళ్లు ఇవ్వలేదని బంగ్లాలో నివసిస్తున్న వారికి ఇల్లు పట్టాలు ఇవ్వడంపై తీవ్రమైన ఆవేదనను వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారని తెలిపారు. ఇళ్ల స్థలాలు ప్రభుత్వ ఉద్యోగులకు, లక్షలు విలువలు చేసే ఇల్లు వున్న వారికి, పెద్ద పెద్ద తోటలు ఉన్నవారికి, బంగ్లాలో ఉన్న వారికి, తహసీల్దార్ ఆఫీసులో ఉన్నవారికి, RDO ఆఫీసులో పనిచేసే కుటుంబానికి, రెండంతస్తుల బంగ్లా ఉన్నవారికి, గవర్నమెంట్ పెన్షనర్ కి ఇవ్వడాన్ని జనసేన పార్టీ తరుపున ఖండిస్తున్నాం. అధికారులు స్పందించని ఎడల ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు విజయ్, నియోజకవర్గ సమన్వయకర్త రాఘవేంద్ర, నియోజకవర్గం గౌరవ అధ్యక్షులు లోకనాథం నాయుడు, శివ, తరుణ్ పాల్గొన్నారు.