సర్వేపల్లి ( జనస్వరం ) : సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో ఏడవ రోజైన బుధవారం జనసేన విజయాత్ర మనుబోలు నుంచి ప్రారంభమైంది. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ ఈ విజయ యాత్ర ముఖ్య ఉద్దేశం జనసేన, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థిని విజయవంతంగా సర్వేపల్లి నియోజకవర్గంలో విజయకేతన ఎగరవేయడమే ముఖ్య లక్ష్యం అన్నారు. మనుబోలు మండలంలో పేదల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేసి మంత్రి అనుచరుడు ఐపీ పెట్టి పారిపోతే ఆ కౌలు రైతులను ఆదుకునే నాధుడే లేకుండా పోయాడు. ఇప్పటికి మంత్రి అనుచరుడి పై ఎలాంటి చర్యలు తీసుకోవడం గాని జరగలేదు. కోట్ల రూపాయల విలువ చేసే భూములను ఆక్రమించారు. జగనన్న సర్వే పేరుతో కోట్ల రూపాయల విలువ చేసే భూములను వైసీపీ నాయకులు కనుసన్నుల్లో అష్టగతం చేసుకోవాలని చూస్తున్నారు. వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలని కాపాడాలంటే రేపు జరగబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థనని గెలిపించి ఆశీర్వదించండి. అలా జరిగితేనే ఈ రాష్ట్రం బాగుంటది కాబట్టి ప్రజలందరూ కూడా ఒక క్షణం ఆలోచించండి. ఈ కార్యక్రమంలో స్థానికులు జాకీర్ ఖాదర్ వలీ, సుబ్రహ్మణ్యం, సుధాకర్, వెంకటాచల మండలం కార్యదర్శి శ్రీహరి, ముత్తుకూరు, మండల సీనియర్ నాయకులు రహీం తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com