- 37వ వార్డు జనసేన నేతలతో డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్
- నడివీధి గంగమ్మకు మొక్కులు చెల్లించిన జనసేన జిల్లా అధ్యక్షులు
తిరుపతి ( జనస్వరం ) : పాలన మారాలంటే పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. మంగళవారం ఆయన స్థానిక 37వ వార్డులోని గిరిపురంలో ఉన్న నడివీధి గంగమ్మ, వినాయకస్వామి ఆలయాలను సందర్శించి... స్వామి, అమ్మవార్లను వేరువేరుగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న జనసేన నేతలు, స్థానికులతో ముచ్చటించారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని, తిరుపతిలో జనసేన, టిడిపి ఉమ్మడి అభ్యర్థి గెలిచి తీరుతారని స్థానికులు ఆయనకు తెలిపారు. 37వ వార్డు ఇన్ చార్జ్ పురుషోత్తం తన ఇంటిని పార్టీ కార్యాలయం గా మారుస్తానని తెలిపారు. త్వరలోనే అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ యాదవ్, జిల్లా కార్యదర్శి, బాటసారి, తిరుపతి నగర ఉపాధ్యక్షులు పార్ధు, సీనియర్ యువ నాయకులు చందు, కార్యదర్శులు కిరణ్ కుమార్, రవి, బాలాజీ, హేమంత్, పురుషోత్తం రాయల్, మనోజ్ కుమార్, గౌస్ బాషా, అర్బన్ అధ్యక్షులు సాయి, జనసైనికులు మోహిత్, బాలాజీ, నవీన్ తదితర నాయకులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com