రాజంపేట, ఏప్రిల్ 12, (జనస్వరం) : ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం పాటూరు పంచాయతి కుమ్మరపల్లె గ్రామంలో రాజంపేట జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు నివాసానికి ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మరియు కూటమి నాయకులు, సభ్యులు రావడం జరిగింది. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా వారికి విందును యల్లటూరు శ్రీనివాసరాజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం మరియు ప్రజలు బాగుండాలంటే ప్రస్తుత రాక్షస పాలన నుండి విముక్తి కలగాలంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయనతోపాటు టి.డి.పి రాజంపేట పార్లమెంటు అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు, రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం వీరు మాట్లాడుతూ రాష్ట్రం ఇప్పటికే అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని కేవలం సంక్షేమమే ముసుగులో రాష్ట్రం అప్పులు పాలు అయిందని ఇటువంటి దౌర్భాగ్య పాలన పోయి సుపరిపాలన రావాలంటే భవిష్యత్తులో రాష్ట్రానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముఖ్యమంత్రులు కావాలని వారు ఆకాంక్షించారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలుపొంది కూటమి ప్రభుత్వం రావడం తధ్యమని వారు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె జనసేన నేత రామదాస్ చౌదరి, నాగోతు రమేష్ నాయుడు,పోలి సుబ్బారెడ్డి, నాగా సుధాకర్ రెడ్డి, యెద్దల సుబ్బరాయుడు, పోతుగుంట నాగేశ్వరరావు, పోతుగుంట రమేష్ నాయుడు, క్రిష్ణ యాదవ్, షబ్బీర్ అహ్మద్, గజపతి రాజు, మస్తానయ్య, రాంప్రసాద్, యల్లటూరు శివరామరాజు, యెద్దల సాగర్, సమ్మెట శివప్రసాద్, కడిమల్ల శ్రీనివాసరాజు, వినోద్ కుమార్, సతీష్ రాజు, మహేష్ రాజు, శ్రీనివాస్ రాజు, గుణ వర్మ, నాసర్ ఖాన్, పత్తి నారాయణ, మౌల, నారదాసు రామచంద్ర,శంకర్ రాజు, చెంచు శంకర, తోట శ్రీను, ఆకుల చలపతి, రాజేష్ వర్మ, గురువిగారి వాసు, కోలాటం హరికృష్ణ, ప్రశాంత్ భారతాల స్థానిక నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com