Logo
Date of Publish : 23 December 2020, 5:35 am
Editor : Sake Naresh

సమస్యను పరిష్కరించకపోతే పోరాటం ఉధృతం చేస్తాం : విశాఖ పశ్చిమ నియోజకవర్గ జనసైనికులు

సమస్యను పరిష్కరించకపోతే పోరాటం ఉధృతం చేస్తాం : విశాఖ పశ్చిమ నియోజకవర్గ జనసైనికులు

               విశాఖపట్నంలో ఇండస్ట్రియల్ ప్రజలు అలాగే, గాజువాక ప్రజలు విశాఖపట్నం సిటీకి చేరుకోవాలంటే అతి సులువైన మార్గము కాన్వెంట్ రోడ్డు మార్గము.  అయితే Essar కంపెనీ నుంచి కాన్వెంట్ కి వెళ్ళే దారిలో పెద్ద పెద్ద టిప్పర్లు కెమికల్స్, మినరల్స్ తీసుకువెళుతూ కవర్ కప్పకుండా రోడ్డు మీద జల్లుతూ వెళ్లడంతో ఇబ్బందిగా మారిందని పశ్చిమ నియోజకవర్గ జనసైనికులు అన్నారు. ఈ చలికాలంలో మంచు వల్ల రోడ్లు జారిపోతున్నాయి. అటుగా టూ వీలర్ మీద ప్రయాణిస్తున్న ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. చాలా మందికి కాళ్లు, చేతులు విరిగిపోవడం మరియు కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. HPCL ప్లాంట్ విస్తరణ కారణంగా గత ఎనిమిది నెలలు నుండి సింధియా to మల్కాపురం రోడ్డు మీద ప్రయాణం చేయడం ఒక నరకం గా మారింది. డంపింగ్ లారీలను ప్లాంట్ లోపల శుభ్రపరచకుండా రవాణా మార్గంలోకి నేరుగా రావడం వలన భయంకర దుమ్ము, ధూళి ఎగిసి పడుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ  తరుపున నిరసన కార్యక్రమo చేపట్టడం జరిగింది. HPCL వారు తమ మొండి వైఖరినీ ఇలానే కొనసాగిస్తే రానున్న రోజుల్లో ఈ పోరాటం మరింత బలంగా చేస్తాం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట్ అభ్యర్థులు చంద్రమౌళి, అంగ ప్రశాంతి, నోట్ల చంద్రకళ, కళ్ల మణిప్రసాద్ మరియు కనకరాజు, రాజు, ప్రకాష్, ధర్మేంద్ర, శ్రీకాంత్, శివ, సత్తిబాబు, మనోహర్, రాధ, గౌతమ్, రమేశ్, తులసి, పరమేష్, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com