Logo
Date of Publish : 20 December 2022, 3:26 pm
Editor : Sake Naresh

నగరిలో రోజా గెలిస్తే గుండు గీయించుకుంటాం – మంత్రులకు ” జనసేన ” సవాల్..! : కిరణ్ రాయల్

           తిరుపతి ( జనస్వరం ) : సినీ రంగులో మునిగి తేలిన మంత్రి రోజాకు ప్రజల కష్టాలు ఏమి తెలుసనీ తిరుపతి జనసేన నేతలు గట్టి వార్నింగ్, సవాల్ విసిరారు. ఆమెగానీ ఈసారి నగరిలో గెలిస్తే జనసేన నేతలు గుండు గీయించుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర మంత్రుల మాటలు, పరుష పదజాలంతో చేస్తున్న ప్రకటనలను ఖండిస్తూ తిరుపతి జనసేన నేతలు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు జనసేన తిరుపతి ఇన్ చార్జి కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సుభాషిని, హేమ కుమార్, సుమన్ బాబు, రాజమోహన్, మునుస్వామి, సుమన్, హేమంత్, సాయి తదితరులు ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. మంత్రి రోజా జబర్దస్త్ స్క్రిప్ట్ లాగా జనసేనతో చాలెంజ్ విసరడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వారాహిని అడ్డుకోవాలని చూస్తే వైకాపా మంత్రులు ఆ వాహనం కిందే పడి నలిగిపోతారని హెచ్చరించారు. సజ్జల రామకృష్ణా రెడ్డి నోరు అదుపులో పెట్టుకోకుంటే రానున్నది జనసేన ప్రభుత్వం అని హితవు పలికారు. తమ జనసేనాని మీ నాయకుడు లాగా అక్రమ సంపాదన, దాన్ని కాపాడుకోవడానికి రాజకీయం చేయడం లేదని ఘాటుగా విమర్శించారు. నిస్వార్ధంగా ప్రజాసేవ చేయడానికి వారాహి వాహనంతో ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడానికి సిద్ధమైతే, వైసీపీ మంత్రులు సీఎం జగన్ మెప్పు పొందడం కోసం పవన్ కళ్యాణ్ ను విమర్శించడం పట్ల ఆక్షేపించారు. 2024లో నగరిలో మరోసారి రోజా గెలిచినా తాను రోజా ఇంటి ముందే గుండు గీయించుకోవడానికి సిద్ధమని, అదే రోజా విఫలమైనా.. వైసిపి ప్రభుత్వం రాకపోయినా బోడి గుండు కొట్టుకోవడానికి ఆమె సిద్ధమా...? అని కిరణ్ రాయల్ సవాల్ విసిరారు. మేకప్ తీసి రోజా బయటకు వస్తే రోజా డ్రైవరే అసహ్యించుకుంటారని, అవినీతి నిజ స్వరూపం ప్రజలకు తెలుస్తుందన్నారు. భవిష్యత్తులో ఎమ్మెల్యే పదవి ఉండదని, జబర్దస్త్ జడ్జి పాత్ర కూడా ఉండదంటూ, ఎందుకంటే రానున్నది జనసేన ప్రభుత్వమేనని పేర్కొన్నారు. కౌలు రైతులు 3000 మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఒక్కరికి లక్ష రూపాయల చొప్పున జనసేన అదినేత సాయమందిస్తే, దానిని మంత్రి అంబటి రాంబాబు, సజ్జల రామకృష్ణారెడ్డిలు విమర్శించడం పట్ల నోరు అదుపులో పెట్టుకోవాలని వారిపై నిప్పులు చెరిగారు. నిస్వార్ధమైన మా జనసేనానిని విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని, ఇది మరోసారి రిపీట్ అయితే రాష్ట్రంలో ఎక్కడ వైకాపా వాచ్ డాగ్ లను తిరగనివ్వమని మంత్రులను హెచ్చరించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com