Search
Close this search box.
Search
Close this search box.

నగరిలో రోజా గెలిస్తే గుండు గీయించుకుంటాం – మంత్రులకు ” జనసేన ” సవాల్..! : కిరణ్ రాయల్

కిరణ్ రాయల్

           తిరుపతి ( జనస్వరం ) : సినీ రంగులో మునిగి తేలిన మంత్రి రోజాకు ప్రజల కష్టాలు ఏమి తెలుసనీ తిరుపతి జనసేన నేతలు గట్టి వార్నింగ్, సవాల్ విసిరారు. ఆమెగానీ ఈసారి నగరిలో గెలిస్తే జనసేన నేతలు గుండు గీయించుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర మంత్రుల మాటలు, పరుష పదజాలంతో చేస్తున్న ప్రకటనలను ఖండిస్తూ తిరుపతి జనసేన నేతలు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు జనసేన తిరుపతి ఇన్ చార్జి కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సుభాషిని, హేమ కుమార్, సుమన్ బాబు, రాజమోహన్, మునుస్వామి, సుమన్, హేమంత్, సాయి తదితరులు ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. మంత్రి రోజా జబర్దస్త్ స్క్రిప్ట్ లాగా జనసేనతో చాలెంజ్ విసరడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వారాహిని అడ్డుకోవాలని చూస్తే వైకాపా మంత్రులు ఆ వాహనం కిందే పడి నలిగిపోతారని హెచ్చరించారు. సజ్జల రామకృష్ణా రెడ్డి నోరు అదుపులో పెట్టుకోకుంటే రానున్నది జనసేన ప్రభుత్వం అని హితవు పలికారు. తమ జనసేనాని మీ నాయకుడు లాగా అక్రమ సంపాదన, దాన్ని కాపాడుకోవడానికి రాజకీయం చేయడం లేదని ఘాటుగా విమర్శించారు. నిస్వార్ధంగా ప్రజాసేవ చేయడానికి వారాహి వాహనంతో ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడానికి సిద్ధమైతే, వైసీపీ మంత్రులు సీఎం జగన్ మెప్పు పొందడం కోసం పవన్ కళ్యాణ్ ను విమర్శించడం పట్ల ఆక్షేపించారు. 2024లో నగరిలో మరోసారి రోజా గెలిచినా తాను రోజా ఇంటి ముందే గుండు గీయించుకోవడానికి సిద్ధమని, అదే రోజా విఫలమైనా.. వైసిపి ప్రభుత్వం రాకపోయినా బోడి గుండు కొట్టుకోవడానికి ఆమె సిద్ధమా…? అని కిరణ్ రాయల్ సవాల్ విసిరారు. మేకప్ తీసి రోజా బయటకు వస్తే రోజా డ్రైవరే అసహ్యించుకుంటారని, అవినీతి నిజ స్వరూపం ప్రజలకు తెలుస్తుందన్నారు. భవిష్యత్తులో ఎమ్మెల్యే పదవి ఉండదని, జబర్దస్త్ జడ్జి పాత్ర కూడా ఉండదంటూ, ఎందుకంటే రానున్నది జనసేన ప్రభుత్వమేనని పేర్కొన్నారు. కౌలు రైతులు 3000 మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఒక్కరికి లక్ష రూపాయల చొప్పున జనసేన అదినేత సాయమందిస్తే, దానిని మంత్రి అంబటి రాంబాబు, సజ్జల రామకృష్ణారెడ్డిలు విమర్శించడం పట్ల నోరు అదుపులో పెట్టుకోవాలని వారిపై నిప్పులు చెరిగారు. నిస్వార్ధమైన మా జనసేనానిని విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని, ఇది మరోసారి రిపీట్ అయితే రాష్ట్రంలో ఎక్కడ వైకాపా వాచ్ డాగ్ లను తిరగనివ్వమని మంత్రులను హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
కందుకూరు
కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది
కందుకూరు
కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way