Logo
Date of Publish : 11 November 2022, 3:43 pm
Editor : Sake Naresh

ప్రశ్నిస్తే! అట్రాసిటీ కేసులు పెడతారా?

● ‘‘గడపగడపకు మన ప్రభుత్వం’’ టిడ్కో ఇల్లు ఎప్పుడు ఇస్తారని అడగడమే నేరమా?
● విజయవాడ 47వ డివిజన్‌ జనసేనపార్టీ అధ్యక్షుడు వెంపల్లి గౌరీ శంకర్‌
     విజయవాడ, (జనస్వరం) : ప్రశ్నిస్తే.. అట్రాసిటీ కేసులు పెడతారా..? ‘‘గడపగడపకు మన ప్రభుత్వం’’లో టిడ్కో ఇల్లు ఎప్పుడు ఇస్తారని అడగడమే నేరమా..? అని విజయవాడ 47వ డివిజన్‌ జనసేనపార్టీ అధ్యక్షుడు వెంపల్లి గౌరీ శంకర్‌ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమస్యల గురించి అడిగితే అట్రాసిటీ కేసులు పెడతారా అని ప్రశ్నించారు. అనంతరం బాధిత మహిళా మాట్లాడుతూ ‘‘గడపగడపకు మన ప్రభుత్వం’’ ద్వారా ఇంటికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే తనను బయటకు పిలిచి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగినట్లు తెలిపారు. దీంతో ఆ మహిళా టిడ్కో ఇళ్లకు డబ్బులు కట్టి చాలా ఏళ్లు అయిందని, అవి ఎప్పుడు ఇస్తారని అడిగారు. వస్తాయి అమ్మా.. కంగారు పడితే ఎలా.. అని అన్నారు. చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం సర్‌.. త్వరగా వచ్చేలా చూడండి అని ప్రాధేయపడిరది. వెంటనే పక్కన ఇంకో మహిళా ముందుకు వచ్చి అడగొద్దు అని చెప్పాం కదా అమ్మ అని అన్నారని తెలిపారు. ఈ లోపు ఇంకో వచ్చి వీళ్లు జనసేన పార్టీ చెందిన వారు అన్నగానే ఎమ్మెల్యే సిరియస్‌ అయి నీకు టిడ్కో ఇళ్లు ఎలా వస్తుందో చూస్తాను అని అన్నారని తెలియజేశారు. వెంటనే వెనుక ఉన్న సీఐను పిలిచి తమపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేయామని చెప్పి వెళ్లిపోయారని తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. టిడ్కో ఇంటి గురించి మాట్లాడితే ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. డివిజన్‌ అధ్యక్షుడు వెంపల్లి గౌరీ శంకర్‌ మాట్లాడుతూ అధికార పార్టీ నిర్వహిస్తున్న ‘‘గడపగడపకు మన ప్రభుత్వం’’ ప్రజల్లోకి వస్తుంటే భయబ్రాంతులకు గురవుతున్నారని తెలియజేశారు. ‘‘గడపగడపకు మన ప్రభుత్వం’’ కార్యక్రమం నిర్వహిస్తున్నారంటే ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రాలేని పరిస్థితికి తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే ఇలా అక్రమ కేసులు బనాయించి బెదిరిపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రౌడీ రాజకీయాలకు చరమగీతం పాడి.. 2024లో జనసేనపార్టీని గెలిపించి పవన్‌ కల్యాణ్‌ ను సీఎం చేస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com