Logo
Date of Publish : 03 December 2022, 8:12 am
Editor : Sake Naresh

ప్రజా సమస్యలు గాలికి వదిలేస్తే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు గంగలో కలపడం ఖాయం

• జనసేనకు ఒక్క చాన్స్ కార్యక్రమంలో జనసేన ఇంచార్జీ ఎద్దేవేత

    పిఠాపురం, (జనస్వరం) : ఏ బిడ్డా ఇది జగన్ అడ్డ అన్నట్లుగా సాగుతున్న వైసిపి పాలనకు ప్రజలు చమరగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని మేము ఈ ఐదు రోజులు జనసేనకు ఒక్క చాన్స్ కార్యక్రమంలో స్పష్టంగా ఈ విషయన్ని గమనించామని పార్టీ పిలుపు మేరకు పట్టణంలో స్థానిక యానాధుల కాలనిలో తలపెట్టిన కార్యక్రమంలో పై విధముగా మీడియాతో మాట్లాడారు. ఇంకా ఆమె మాట్లాడుతూ ప్రజలు వెల్లువెత్తిన సమస్యలతో ఆవేదన చెందుతున్నారని ఇక్కడ ఈ కాలని వాసులు వీధి లైట్లు లేక చంటి పిల్లలతో చీకట్లో గడుపుతుంటే వార్డు కౌన్సిలర్ పటించుకోలేదని అధికారులు ఏ నాయకుడు పట్టీంచుకోకపోవడంతో కాలని వాసులే చందాలేసుకుని రెండు స్తాంభాలు కొనుకుంటే వాటిని వేయడానికి కూడా ఏ అధికారి రాకపోవడం అంటే పాలన ఏ స్ధాయిలో ఉందో అర్థం చేసుకోవాలని ఇంత ఇబ్బంది పడుతుంటే ఓట్లు వేయించుకున్న కౌన్సిలర్ నిద్ర పోతున్నాడ అని మండిపడ్డారు. ఇరవై కోట్లు పట్టణ అభివృద్ధి ప్రకటించారు. అవి ఇలాంటికి ఉపయోగించకుండా ఏ గాలికి మళ్ళీంచారో సమాదనం చెప్పాలని కాలనిలో అడుగు పెడితే డ్రైనేజి, పరిసరాలు కంపుకొడుతున్నాయని, కొల్లగొట్టే పనులు ఆపి ఇలా కంపు కొట్టే ప్రాంతాలు బాగు చేయడానికి మనసురాని నాయకులకు సాగనంపుతారని జనసేన పార్టీ అధికా‌ంలోకి వస్తే ఈ కాలని కంచుకోట చేస్తామన్నారు. కాలని వాసులను ఆప్యాయంగా పలకరిస్తు మీ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు జనసేన పోరాడుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి రామకృష్ణ, బుర్రా సూర్యప్రకాష్, మేళం బాబి, కసిరెడ్డి నాగేశ్వరరావు, పబ్బినీడి దుర్గాప్రసాద్, కంద సోమరాజు, వినయ్, సుబ్రహ్మణ్యం, నామ సాయిబాబు, అంజిబాబు, సింహాద్రి, రాజు, కృష్ణ, శ్రీనివాస్, రాజేంద్ర,జన సైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com