విజయవాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వo కార్యక్రమం 48వ డివిజన్ అధ్యక్షులు కొరగంజి వెంకటరమణ ఆధ్వర్యంలో చిట్టినగర్ ఉప్పలపాటి రామచంద్ర రాజు వీధి వద్ద నుండి ప్రారంభించి చిట్టినగర్ పరిసర ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. మీడియా పాయింట్ వద్ద పోతిన మహేష్ గారు మాట్లాడుతూ ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రజలందరూ కూడా తమ సమస్యలను అనేకం చెప్పుకుంటున్నారని ముఖ్యంగా చాలామందికి పెన్షన్లు ఇవ్వక పోవడమే కాకుండా పాత పెన్షన్లు రద్దు చేస్తున్నారు అంటే ఇది సంక్షేమ ప్రభుత్వమా లేక సంక్షేమ పథకాల కోతల ప్రభుత్వమా అర్థం అర్థం చేసుకోవచ్చని ఈ రాష్ట్రంలో అమరావతి తో పాటు రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జాడే లేదని, సిఎం జగన్ గారి పాలనలో అన్యాయం , అరాచకాలు అవినీతి జరుగుతుందని ముఖ్యంగా స్థానిక ప్రజలు అందరూ కూడా ఆడపిల్లలును చిన్న పిల్లల్ని బయటకు పంపించే పరిస్థితి లేదని ఎక్కడ చూసినా యువకులు గంజాయి మత్తులో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నరని, ఇళ్ళ ముందు మా పిల్లలు ఆడుకునే పరిస్థితి లేదని, రాజధాని నడి బొడ్డు ప్రజలు ఈ విదంగా చెప్తున్నారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని , ఈ రాష్ట్రంలో గంజాయి, మత్తు బిళ్ళల అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి అని, గంజాయి అమ్మకాలు ఎక్కడ కూడా నిరోధించలేకపోతుందని, మహిళలు ఆందోళన పెద్ద వ్యక్తం చేస్తున్నారని , దీనిపై పోలీస్ కమిషనర్ గారు గంజాయి అమ్మకాల పై దృష్టి సారించి గంజాయి అమ్మకాలను పూర్తిగా నిరోధించాలని గంజాయి సేవించి ప్రజలను ఇబ్బంది పెడుతున్న గంజాయి గ్యాంగులపై ఉక్కు పాదం మోపాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అదేవిధంగా రాష్ట్రంలో అభివృద్ధి జాడ లేదని అదేవిధంగా అమరావతి అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారు చంపేశారని, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి అని, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అమరావతిపై అక్కసుతోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేకుండా చేశారని అదే అమరావతిని అభివృద్ధి చేసినట్లయితే ఈ రాష్ట్రానికి అప్పులు ఉండేవి కావాని, అభివృద్ధి జరిగేదని పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చేవాని, తద్వారా ఈరాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉపాధి లభించేవని, ఈ రాష్ట్రంలో యువత గంజాయి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చక్కగా ఉద్యోగాలు చేసుకునేవారు అని ఈ పాపం జగన్మోహన్ రెడ్డి, వైసిపి ప్రభుత్వానిది కాదా అని దీనికి జగన్ మోహన్ రెడ్డి గారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నానని ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి గారు తన తప్పును తెలుసుకుని అమరావతిని రాజధానిగా ప్రకటించాలని అక్కడ అభివృద్ధికి నిధులు కేటాయించాలని నిధులు కేటాయించడంతోపాటుగా అభివృద్ధి పనులకు చర్యలు చేపట్టకపోతే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర హీనులుగా నిలిచిపోక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామన్నారు.
డివిజన్ అధ్యక్షులు కొరగంజి వెంకటరమణ మాట్లాడుతూ డివిజన్లో సమస్యల తీష్ట వేశాయని ప్రతి సమస్యలపై జనసేన పార్టీ నిరంతరం పోరాడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని పెన్షన్లు రేషన్ కార్డులు కొత్త నిబంధనలు పెట్టి రద్దు చేస్తున్నారని , తీడ్కో జిల్లా కోసం డబ్బులు చెల్లించామని నేటి వరకు ఇల్లు మంజూరు చేయలేదని స్థానిక కార్పొరేటర్ ఎవరో మాకు తెలియడం లేదని , స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లు ఆలీబాబా 40 దొంగలు తయారయ్యారని, పశ్చిమంలో ప్రత్యామ్నాయ పార్టీ జనసేన పార్టీ అని పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో పోతిన మహేష్ గారు మాత్రమే ప్రజల తరఫున పోరాడుతున్నారని వారే పశ్చిమానికి ప్రత్యామ్నాయమని, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నాలుగు సంవత్సరాల నుంచి నిరంతరం ప్రజల కోసం పోరాడుతూనే ఉన్నారని, గత ఎన్నికల్లో పొరపాటు చేశామని రాబోయే ఎన్నికల్లో తప్పక పోతిన వెంకట మహేష్ ను జనసేన పార్టీ గాజు గ్లాస్ సింబల్ పై గెలిపిస్తామని ప్రజలే స్వచ్ఛందంగా చెబుతున్నారని, మీరెన్ని నాటకాలు అడినా డ్రామాలాడిన వె ల్లంపల్లి శ్రీనివాస్ గారి పని అయిపోయిందని సీఎం జగన్ గారే స్వయంగా రంగంలో దిగిన మీ ఓటమి తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు వేవిన నాగరాజు, తమ్మిన రఘు, అక్షయ్ డివిజన్ అధ్యక్షులు ఆకుల రవిశంకర్, రెడ్డిపల్లి గంగాధర్ ,కొరగంజి వెంకటరమణ, ,బొమ్ము రాంబాబు , కోరాకుల సురేష్ ,సిగానంశెట్టి రాము, మల్లెపు విజయలక్ష్మి , తిరుపతి అనూష, తమ్మిన లీలా కరుణాకర్, ఏలూరు సాయి శరత్, జెల్లీ రమేష్, కమల సోమనాదం,వెన్న శివశంకర్ , పాల రజిని, బోట్టా సాయి, తదితరులు పాల్గొన్నారు .