విజయవాడ, జనవరి 15 : విజయవాడ సిటీ వైడ్ చిరంజీవి యువసేన అధ్యక్షులు పుల్లిచేరీ రమేష్, 50 అధ్యక్షులు రెడ్డిపల్లి గంగాధర్ పరివేక్షణలో కొక్కిలిగడ్డ యశ్వంత్ వర్మ పాడిన "మహేష్ అన్న గెలిస్తే మనం గెలిచినట్టే రా" పాటని జనసేన పార్టీ ఇంచార్జ్ పోతిన వెంకట మహేష్ సతీమణి పోతిన విజయ లక్ష్మి చేతుల మీదుగా ఆదివారం అవిష్కరించారు. ఈ సందర్భంగా పాట రచయిత, గాయకుడు కొక్కిలిగడ్డ యశ్వంత్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పోతిన మహేష్ ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆఖండ మెజారిటీతో ప్రజలు గెలిపించబోతున్నారని, నిత్యం ప్రజల కోసం పనిచేస్తూ ప్రజల ప్రేమ సంపాదించిన మహావ్యక్తి పోతిన మహేష్ అని అన్నారు. గొంతెత్తిన వారిని అణచివేస్తూ నిరంకుశ పాలన సాగిస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వంలో నియంతలాంటి జగన్ పోకడలను, జగన్‌కు గులాం అంటున్న వెలంపల్లి వైఖరిని ఎండగట్టి, ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ధర్నాలు చేస్తూ ప్రభుత్వ చర్యలు ధైర్యంగా ఎదుర్కొన్న ధైర్యవంతుడు పోతిన మహేష్ అని అన్నారు. యువత భవిష్యత్తుకు మార్గదర్శకుడు, విద్యావంతుడు, ప్రజా సమస్యల పట్ల, నియోజకవర్గంలోని ప్రజల అవసరాల పట్ల మంచి అవగాహన ఉన్న వ్యక్తి అయినటువంటి పోతిన వెంకట మహేష్‌ని రానున్న ఎన్నికల్లో గెలిపించాలని, ఇటువంటి ప్రజా నాయకుడు గెలుపు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి మలుపు అని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సిటీ వైడ్ చిరంజీవి యువసేన సభ్యులు చొక్కార రమణ, రౌతు దుర్గారావు, పొట్నూరి శేషు సత్యల విజయ్ జనార్ధన్ సరగడ దుర్గారావు, జనసేన నాయకులు రెడ్డిపల్లి అనిత, సావిన్కర్ నరేష్, నూనె సోమశేఖర్, పిళ్ళా రవి, మదెల కనకారావు,పిల్ల శివ , చిట్టి రమణ రెడ్డి ,తేజ తదితరులు పాల్గొన్నారు
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com