Logo
Date of Publish : 21 November 2022, 2:19 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీని రౌడీ సేన అని సీఎం జగన్ అంటుంటే దెయ్యాలే వేదాలు వల్లించినట్లు ఉంది

         నెల్లూరు ( జనస్వరం ) : సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 189వ రోజున 42వ డివిజన్ కోటమిట్ట పార్క్ వీధి ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారం దిశగా పోరాడుతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో విపరీతమైన అరాచకాలు, ఆగడాలు చేస్తున్న రాజకీయ పార్టీ ఏదైనా ఉందా అంటే అది వైసీపీ మాత్రమే అని, ప్రజల స్వేచ్ఛను హరించేలా అధికారంలో ఉన్న ఈ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు, విధ్వంసాలు మితిమీరి పోయి ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛగా జీవించే హక్కును కాలరాసిన పార్టీ, పోలీసులు, బ్యూరోక్రాట్ల మితిమీరిన పోకడలతో రాష్ట్ర పరిపాలనను నడుపుతూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అపహాస్యం చేసిన పార్టీ వైసీపీ అని దుయ్యబట్టారు. అటువంటి వైసీపీ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు నేడు జనసేన పార్టీని రౌడీ సేన అంటూ అభివర్ణించడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి సమస్యపై ప్రజలకు అండగా నిలబడుతూ ధీటుగా పోరాడుతున్న పవనన్నని చూస్తుంటే జగనన్నలో భయం మొదలైందని, ఆ అభద్రతాభావంలో నుండి పుట్టుకొచ్చిన పదాలే ఆయన నోటి నుండి వెలువడ్డాయని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలియజేసారు. రానున్న ఎన్నికలు ఎప్పుడు జరిగినా, రాష్ట్రంలో పరిణామాలు ఎలా ఉన్నా, ప్రజలందరి ఆశీస్సులతో కాబోయే ముఖ్యమంత్రి పవనన్నే అని కేతంరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com