Logo
Date of Publish : 28 January 2022, 1:46 pm
Editor : Sake Naresh

గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో మద్యపానం నిషేధిస్తే డిప్యూటీ సీఎంకి గుడి కడతాం

● ప్రజల ప్రాణాలు ముఖ్యమా? మద్యం షాపు ముఖ్యమా?

● కత్తెర పల్లి బెల్టుషాపును రద్దు చేయాలి:

● గంగాధర నెల్లూరు జనసేన ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్.

      కార్వేటినగరం, (జనస్వరం) : చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం, కొల్లాగుంట గ్రామం వద్ద ఉన్న బెల్ట్ షాప్ ను కత్తెర పల్లి గ్రామానికి మార్చడం సరైనది కాదని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జ్ డాక్టర్ యుగంధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు ముఖ్యమా లేక మద్యం షాపులు ముఖ్యమా అని ఎద్దేవా చేశారు. కత్తెర పల్లిలో ఏర్పాటు చేస్తున్న బెల్ట్ షాప్ నిర్మాణాన్ని, అక్కడ ప్రారంభించనున్న బెల్ట్ షాప్ ను తక్షణమే ఆపి, ప్రజా ప్రయోజనార్థమైన పనులు చేయాలని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని ఈ సందర్భంగా తెలిపారు. ఇక్కడ బెల్టుషాపులు కొనసాగిస్తే చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల ప్రజలతో కలిసి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన దీక్షలు నిర్వహిస్తామని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి చొరవ తీసుకుని ఈ ప్రాంతాన్ని మద్యరహిత ప్రాంతంగా చేయాలని, ప్రజల ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని తెలిపారు. ఈ నియోజకవర్గం నుండే మద్యపానం నిషేధించడం కలిగితే డిప్యూటీ సీఎం నారాయణస్వామికి నియోజకవర్గంలో పాలాభిషేకం చేసి, ఒక గుడి కడతామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, మండల ఉపాధ్యక్షులు మహేష్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి వెంకటేష్, భగత్ సింగ్ స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రెటరీ సాయి కుమార్, జితేంద్ర, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com