ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో ఉన్న కుటుంబాలకు నిత్యావసర సరుకులు సహాయం చేసిన ఇచ్చాపురం జనసైనికులు
శ్రీకాకుళం జిల్లాలోని ఆంధ్ర ఒడిశా సరిహద్దు అయిన ఇచ్చాపురం పరిసరాల్లో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు కరోనా మహమ్మారి కష్ట కాలంల, అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నిరుపేద కుటుంబానికి ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు తిప్పనదుర్యోధన రెడ్డి గారు సహాయం చేయడం జరిగింది. మన పొరుగు రాష్ట్రం అయిన ఒడిషా రాష్ట్రంకి సంబంధించిన పేటూరు గ్రామానికి చెందిన మంగళ రామలక్ష్మి కుటుంబానికి ఇచ్చాపురం మండలం జనసేన నాయకులు శ్రీ తిప్పన దుర్యోధన రెడ్డి గారు తన వంతునా 1000 రూపాయలు, 20kg బియ్యం, 5kg కూరగాయలు మరియు నిత్యావసర సరుకులు సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పేటూరు గ్రామపెద్దలు, జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.