ఇచ్చాపురం, (జనస్వరం) : ఇచ్చాపురం మండలం డొంకూరు గ్రామానికి చెందిన మత్స్యకార యువకులు పెద్దఎత్తున జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తిప్పన దుర్యోధనరెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గ నాయకులు దాసరి రాజు ఆధ్వర్యంలో సుమారు 30 మంది పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలతో మత్స్యకారులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుండడంతో జనసేన పార్టీలో చేరినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బైపల్లి ఈశ్వరరావు, వల్లభ "జానిమోహన్, బాలరాజురెడ్డి, భాస్కర్‌రెడ్డి, సంతోష్ మహర్ద,దాసరి సాయి, కృష్ణ, జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com