విజయవాడ ( జనస్వరం ) : దసరా ఉత్సవాల ఏర్పాట్లు పై జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ మాట్లాడుతూ అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవ శోభ లేదని, అంతరాలయంలో పూల అలంకారంకు కూడా అమ్మవారు నోచుకోలేదని, అంతరాలయం బోసిపోయిదని, అమ్మవారి అంతరాలయంకు రంగులు కూడా వేయలేదని వాపోయారు. బంగారు తాపడం పాలిష్ కూడా చేయించలేదని ఇంకా పాలకమండలి సభ్యులు ఫెస్టివల్ ఆఫీసర్ లు దేవాదాయ శాఖ మంత్రి ఈవో ఎందుకని అన్నారు. సామాన్య భక్తులకు వసతులు లేవు మంచినీళ్లు ప్యాకెట్లు తప్పించి మరేమీ ఇవ్వడం లేదని పసిపిల్లలకు పాలు కూడా దేవాదాయ శాఖ & ప్రభుత్వం వారు కాదు ఇచ్చేది హెల్పింగ్ హాండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఇస్తుందని అన్నారు. వృద్ధులకు వికలాంగులకు లిఫ్ట్ సౌకర్యం ఎందుకు కల్పించడం లేదని, సామాన్య భక్తులకు లేని వసతులు విఐపి భక్తులకు మాత్రమే ఎందుకని, విఐపి భక్తులపై తక్కువ చేసి మాట్లాడటం లేదు వారికి ప్రత్యేక టైం స్లాట్ కేటాయించండి అని అన్నారు. రాష్ట్ర ఉత్సవం అంటున్నారు దసరా ఉత్సవాల ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలని, అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం 70 కోట్ల రూపాయల నిధులు ప్రకటించిన సీఎం జగన్ గారు ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం మాత్రమే ఉన్నందున సీఎం గారు అమ్మవారి ఆలయ దర్శనానికి వచ్చే ముందే అమ్మవారి ఆలయ ఖాతాకు 70 కోట్ల రూపాయల నిధులు జమ చేయాలని అన్నారు.
ఈసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మవారి ఆలయ దర్శనానికి వచ్చేటప్పుడు కొండ రాళ్లు జారి పడకూడదని, అంతరాలయంలో కరెంట్ షాక్ కొట్టి ఎవరూ చనిపోకూడదని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామని, నేను మాట్లాడుతున్నది సామాన్య భక్తుల సౌకర్యాలు దర్శనం కోసం మాత్రమే ఎక్కడా రాజకీయాలు మాట్లాడలేదని, ఘాట్ వద్ద కొబ్బరికాయలు పసుపు కుంకుమ అమ్ముకునే వాళ్లకు వినాయకుడి గుడి దగ్గరైన అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాంమని అన్నారు. నేను లేవనెత్తిన అంశాలను వెంటనే సరిచూసుకొని ఆలయ ఉత్సవ శోభను పెంచాలి. సామాన్య భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని, అమ్మవారి కాపలాదారున్ని కనుకనే దసరా ఉత్సవాల సమయంలో నన్ను అడ్డుకున్న దసరా ఉత్సవాలలో సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగజేయకూడదని సంయమనం పాటించమని అమ్మవారి ఆలయంలోని మీడియా పాయింట్ వద్ద దసరా ఉత్సవాల్లోని లోపాలను ప్రస్తావిస్తూ ఉంటే మాట్లాడనీయ కుండా మైక్ కట్ చేసి అడ్డుపడిన దేవాదాయ శాఖ అధికారులు మరియు ఫెస్టివల్ ఆఫీసర్ ఆజాద్. అందుకు పోలీస్ శాఖ వారు సహకరించారని ఇలా చేయడం సామాన్య భక్తుల గొంతు నొక్కడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ధార్మిక మండల సభ్యులు కరిమి కొండ శివరామకృష్ణ, s.శిరీష, రాళ్లపూడి గోవింద్, అడ్డగిరి,పుల్లారావు, ఉమామహేశ్వరి, ఉదయ లక్ష్మి, విజయలక్ష్మి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.