ఎమ్మిగనూర్ ( జనస్వరం ) : దేశంలో ఎన్నో ఏళ్లుగా అధికారం కలిగి పెద్ద పార్టీలుగా ఆవిర్భవించి ప్రజాదరణ కలిగి ప్రభుత్వాలను ఏర్పాటు చేసినా కార్యకర్తల సంక్షేమం గురించి మాత్రం ఆలోచించలేదనీ జనసేన పార్టీ ఎమ్మిగనూరు నియోజక వర్గ ఇంఛార్జి రేఖ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం రోజు ఎమ్మిగనూరు జనసేన పార్టీ కార్యాలయంలో సభ్యత్వాలు చేయించిన వాలెంటిర్లకు క్రియాశీలక కార్యకర్తల కిట్లను పంపిణీ చేశారు. అనంతరం రేఖగౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన రాజ్యమేలుతూ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించి వైఎస్సార్ సిపి పార్టీ నాయకులు బాణసంచా పేల్చుతు సంబరాలు చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారని రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవని పదవులు ఎవరికి శాశ్వతం కాదనే విషయాన్నీ విస్మరించి మూర్ఖపు ఆలోచనలతో అభివృద్ధి అనే పదాన్ని మరిచి బటన్ నొక్కి మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే బ్రమలో ఉన్నారని అన్నారు. ఎన్నడూ లేని విధంగా భూతు మాటలతో సమాధానం చెప్పే మంత్రుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మార్చే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. జనసేన కార్యకర్తలు ఎవ్వరు అధైర్య పడొద్దని అండగా ఉంటానని తెలిపారు. జనసేన టిడిపి కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం తధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత వికాస రాష్ట్ర కార్యదర్శి రవి ప్రకాష్, నియోజక వర్గ మీడియా ఇంఛార్జి, గానిగ బాషా, నాయకులు రాహుల్ సాగర్,వినయ్,షబ్బీర్,మురళి, రమేష్, ఖాసిం సాహెబ్, దూద్ పీర్, ఆలి, సుభాన్, అక్బర్ వలి పాల్గొన్నారు,
One Response
సైకో పోవాలి.పవన్ రావాలి.