సర్వేపల్లి ( జనస్వరం ) : నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో బుధవారం నేను నా కుటుంబం నా జనసైనికుడు అనేటువంటి నూతన కార్యక్రమాన్ని ముత్తుకూరు మండలంలోని పైనాపురం దెబ్బ మీద హరిజనవాడ నందు కొనసాగించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రేపు జరగబోయే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించడంతోపాటు అన్ని గ్రామపంచాయతీలో జనసైనికులు వాళ్ళ యొక్క వివరాల సేకరణ, గ్రామాలలో నెలకొని ఉన్న సమస్యలు తెలుసుకొని రేపు ఎన్నికల అనంతరం సమస్యలపై పరిష్కారం, నూతన కార్యచరణతో జనసేన పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయడం లక్ష్యంగా కొనసాగుతుందని అన్నారు. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ గ్రామపంచాయతీ పరిధిలోని పైనాపురం దెబ్బ మీద హరిజనవాడ చుట్టుపక్కల పవర్ ప్లాంట్ల కారణంగా పొల్యూషన్ తో అనారోగ్య సమస్యలు రావడంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఉచితంగా వైద్యాన్ని అందించినటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ చుట్టుపక్కల పవర్ ప్లాంట్లకు భూములు ఇచ్చిన రైతులకి కనీసం యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితి కూడా కనిపించడం లేదు. రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం కలిసి ఉమ్మడి ప్రభుత్వంలో ఈ గ్రామపంచాయతీలో కూడా అభివృద్ధి చేస్తాం. ఈ కార్యక్రమంలో వీర మహిళ గుమినేని వాణి భవాని ,శ్రీ హరి స్థానికులు మస్తాన్, రహీం, అశోక్, అక్బర్, గిరీష్, రహమాన్, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com