తెలుగుదేశం జాతీయ అధ్యక్షులునారా చంద్రబాబు నాయుడుగారి అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు కాకినాడ రూరల్ నియోజకవర్గం 12వ రోజు రిలే నిరాహార దీక్ష శిబిరం నిర్వహించారు. ఈ దీక్షకు జనసేన పార్టీ రాష్ట్ర పిఏసి సభ్యులు మరియు కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి గంగాధర్, కరప మండల కార్యదర్శి చింతా వెంకట్, పెద్ద కొత్తూరు గ్రామ అధ్యక్షులు అల్లు గంగాద్రి, వేలంగి జనసేన నాయకులు మురళి, జన సైనికులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. 'నేను సైతం బాబుతో' కార్యక్రమం కోసం సంతకాలు సేకరించారు. కార్యక్రమంలో చప్పిడి వెంకటేశ్వరరావు, దేవు వెంకన్న, కోనా వెంకటలక్ష్మీ, కే వినాయక్, బొంతు నాగేశ్వరరావు, గీశాల వెంకటేశ్వరరావు, అడపా రామచంద్రరావు, కే భూషనం, పురం సత్యప్రసాద్, చుండ్రు వెంకన్న రాయ్ చౌదరి, పలివెల జానకీ రామయ్య, మేడిశెట్టి పట్టాభి, నులుకుర్తి వీరన్న, కెవిఆర్ చౌదరి మరియు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com