విజయవాడ, (జనస్వరం) : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55వ డివిజన్ నుంచి పల్లంటి ఆది బాబు, సురేంద్ర, మోహన్, రమేష్, వెంకటేష్, అత్తిలి సాయి, సుభాని, అల్లి మధు, రాజేష్, నాగబాబు, సుధీర్, శ్రీను, సుమంత్ మరియు 25 మంది స్థానిక డివిజన్ అధ్యక్షులు సోమి గోవింద్ నేతృత్వంలో జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో పార్టీలోకి చేరడం జరిగింది. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నాయకత్వ పటిమా, సిద్ధాంతాలు, భావజాలం నచ్చి పార్టీలోకి చేరారని వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని, త్వరలో వీరందరికీ స్థానిక డివిజన్ కమిటీలో మంచి స్థానం కల్పిస్తామని డివిజన్ లో పార్టీని బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని, స్థానిక ప్రజా సమస్యల పరిష్కార దిశగా కష్టించు పనిచేయాలన్నారు. కార్యక్రమం నిర్వహించుకునేందుకు సహకరించిన బొబ్బరి కొండలరావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com