శ్రీ భగవాన్ కాశీనాయన వృద్ధాశ్రమం నందు పండ్లు, కూరగాయలు,రోజువారీ సరుకులు అందజేసి,వైద్యం అందించిన హ్యూమన్ రైట్స్ పల్నాడు జిల్లా ప్రతినిధులు.
దాచేపల్లి,డిసెంబర్10.(జనస్వరం)
మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా నేషనల్ చైర్మన్ అండ్ ఫౌండర్ డాక్టర్ చెన్నుపాటి శ్రీకాంత్ ఆదేశాల మేరకు నేషనల్ జనరల్ సెక్రెటరీ మాదాసు చారేంద్ర సూచనలతో నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కందుల చందు సలహా మేరకు పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలోని కేశనపల్లి గ్రామం నందు గల శ్రీ భగవాన్ కాశీనాయన వృద్ధాశ్రమం నందు వృద్దులకు కాయలు,పండ్లు మరియు రోజు వారి వస్తువులు పంచడం మరియు వారికి అవసరం అయిన మందులను డాక్టర్ అనంత నరసింహారావు, HRCI పల్నాడు జిల్లా ఆర్గనైజేషన్ కార్యదర్శి తిరుమలవరపు సైదారావు(RMP) లతో మెడికల్ క్యాంప్ నిర్వహించి అందజేయటం జరిగినది,
కార్యక్రమం నిర్వాహకులు జిల్లా ఉపాధ్యక్షులు మరియు జిల్లా ఇంచార్జి కోఠారి సురేష్,జిల్లా కన్వీనర్ మువ్వల వెంకట మనోజ్ ,జిల్లా కోఆర్డినేటర్ మిర్యాల పుల్లారావు,జిల్లా యూత్ వింగ్ ఉపాధ్యక్షులు కోట మధు,జిల్లా ప్రోగ్రామ్ కార్యదర్శి బొజ్జా ఆదినారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు మాదాపూర్ సునీల్,దాచేపల్లి మండల అధ్యక్షులు ఆతుకూరి అమరేష్,జిల్లా ప్రధాన కార్యదర్శి హరిదాసు బాలు పాల్గొనడం జరిగినది.