అరకు ( జనస్వరం ) : హుకుంపేట మండల కేంద్రంలో జనసేన పార్టీ మండల అద్యక్షులు బలిజ కోటేశ్వరరావు పడాల్ గారి ఆద్వర్యంలో మండల కమిటీ ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశంలో కోటేశ్వరరావు పడాల్ మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న వేల జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి సివేరి దొన్నుదొరకు అరకొర నియోజక వర్గం అభ్యర్థి గా టికెట్ కేటాయించడం సంతోషమని, పొత్తు ధర్మంలో భాగంగా గెలిపించాలని జనసేన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మండల కమిటీ, గ్రామ కమీటీలు, బూత్ కమిటీలు అందరూ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి పార్టీ సిధ్ధాంతాలు,ఆశయాలు ఇంటింటికి చేరేలా క్రృషి చేయాలని ఎన్నికలు ఎంతో దూరంలో లేదన్నారు. గిరిజనులకు మోసం చేసిన వైఎస్సార్ సిపి ని వెంటనే గద్దె దించాలని పిలుపు ఇచ్చారు. ఈ సమావేశంలో మండల నాయకులు వంతాల మోహన్, మజ్జి క్రిష్ణంరాజు, జన్ని లింగన్న, డుంబేరి చిరంజీవి, బూడిద నాగరాజు, కొర్ర అప్పలరాజు, రాప బుద్దు, వీర మహిళ కొర్ర సరస్వతి, సొనభ జాన్ బాబు, కిల్లో రమేష్, లకే బాలచంద్ర,కొర్ర నారాయణ మూర్తి, తామర్ల జనార్దన్,పాంగి నరసింగరావు, పాంగి వరుణ్, ముసిరి లక్మణ్, గెమ్మలి సింహాచలం, మజ్జి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com