Logo
Date of Publish : 08 November 2025, 5:39 pm
Editor : Sake Naresh

కోటి సంతకాల సేకరణ కు భారీ స్పందన

- వైయస్సార్సీపి మేధావుల విభాగం ఆధ్వర్యంలో జోరుగా సాగుతున్న సంతకాల సేకరణ
- వైద్య కళాశాలల ప్రైవేటీకరణనను విరమించుకోకపోతే భారీ మూల్యం తప్పదు

అనంతపురం, నవంబర్ 8, జనస్వరం : రాష్ట్రంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణను విరమించక పోతే భారీ మూల్యం తప్పదని వైయస్సార్సీపి మేధావుల విభాగం నేతలు డాక్టర్ శంకరయ్య హెచ్చరించారు. వారు శుక్రవారం నగరంలోని గుత్తి రోడ్డు నందు మార్కెట్ యార్డ్ ప్రాంతంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ శంకరయ్య, రాష్ట్ర కార్యదర్శి కట్టుబడి తానీషా, జిల్లా రిటైర్డ్ ప్రిన్సిపాల్ జనార్థన్ రెడ్డి,రిటైర్డ్ లెక్చరర్ మహాదేవ రెడ్డి లు కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తున్నట్లు తెలిపారు. అనంతపురం గుత్తి రోడ్ లో మార్కెట్ యార్డ్ గొర్రెల సంత మరియు పండ్ల మార్కెట్ లో వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మేధావుల విభాగం ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన వైద్య కళాశాలలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేక కేవలం 5000 కోట్లను ఖర్చు చేస్తే అన్ని కళాశాలలో నిర్మాణం పూర్తి అయ్యి పేదలకు నాణ్యమైన విద్యతో పాటు వైద్యం కూడా అందుతుందని వారు పేర్కొన్నారు. ఓటమి ప్రభుత్వము అధికారం లేక వచ్చిన తర్వాత 16 నెలలకే రెండు లక్షల 25 వేల కోట్ల అప్పులు చేసి దుబారా చేస్తున్న సందర్భంలో కేవలం 5000 కోట్లు ఖర్చు చేసేందుకు వెనుకడుతోందని అన్నారు. పేదలకు సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలంటే చంద్రబాబుకు మనసు ఒప్పడం లేదని వారు అన్నారు. కేవలం ధనార్జన కోసమే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి మెడికల్ కళాశాలల అప్పజెప్పడం మంచి పద్ధతి కాదని అన్నారు. ఇందులో భాగంగానే ప్రజలకు వాస్తవాలు తెలియాలనే సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సిపి చేపట్టిన సంతకాల సేకరణలో భాగంగా మేము సైతం అంటూ వారు నగరంలో గత వారం రోజులుగా చేపట్టినట్లు వారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ శంకరయ్య, రాష్ట్ర కార్యదర్శి కట్టుబడి తానీషా, జిల్లా రిటైర్డ్ ప్రిన్సిపాల్ జనార్థన్ రెడ్డి,రిటైర్డ్ లెక్చరర్ మహాదేవ రెడ్డి,వైసిపి నాయకులు యన్. దాసిరెడ్డి,వై.సూర్య నారాయణ రెడ్డి, మహబూబ్ పీరా, హాజీ బాషా తదితరులు పాల్గోన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com