Logo
Date of Publish : 27 March 2026, 6:17 pm
Editor : Sake Naresh

శ్రీరామనవమి సందర్భంగా అనంతలో భారీ బైక్ ర్యాలీ

అనంతపురం, మార్చి 17, (జనస్వరం) : శ్రీరామనవమి సందర్భంగా అనంతపురం నగరంలోని హరిహర టెంపుల్ నుండి బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. సురేష్, కేశవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ హరిహర టెంపుల్ నుంచి ప్రారంభమై మెడికల్ కాలేజ్, ఐటీఐ, మీట్, సప్తగిరి సర్కిల్, ఓల్డ్ టౌన్, బంగారపు వీధి మార్గంగా సాగి చివరగా జూనియర్ కాలేజీలో జరుగుతున్న శ్రీరామ రథోత్సవంలో కలిసింది. ఈ కార్యక్రమంలో యువత ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హరిహర టెంపుల్ అధ్యక్షుడు రవి, అరవింద్ నగర్ ఆర్ఎస్ఎస్ ఇంచార్జ్ నాగేంద్ర యాదవ్, హిందూ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. మరక నాగేంద్ర మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్ల భారతీయ కుటుంబ వ్యవస్థకు ముప్పు ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్యలో శ్రీరామ ఆలయ నిర్మాణం ద్వారా సనాతన ధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారని కొనియాడారు. యువత సనాతన ధర్మం వైపు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో సనాతన ధర్మాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ మహిళలు, యువత వందలాది సంఖ్యలో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com