తుని ఘటన ముందు :
శ్రీ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికల్లో గెలిచేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగా పాదయాత్ర మొదలుపెట్టారు. ఆ పాదయాత్రలో ఎవరూ కూడా అడగకుండానే కాపులకు బీసీల రిజర్వేషన్ హోదా కల్పిస్తూ, ఇతర బీసీలకు అన్యాయం చేయకుండా ఇస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా కాపు యువత వారి భవిష్యత్తు కోసం, సంక్షేమం కోసం ప్రతి ఏటా రూ.1000 కోట్ల రూపాయల చొప్పున 5 సంవత్సరాలకు రూ.5000 వేల కోట్ల రూపాయల నిధులు ఇచ్చి కాపు జాతి అభ్యున్నతికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో అపుడు చంద్రబాబు గెలవడానికి కూడా ఈ కాపు జాతి రిజర్వేషన్ కూడా ఒక అంశమే అని చెప్పారు శ్రీ శాంతి ప్రసాద్ గారు.
తుని ఘటన తరువాత :
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టి కొన్ని నెలలు గడిచినా కాపు కార్పొరేషన్ గానీ, బీసీ రిజర్వేషన్ గాని మాట ఎత్తకపోవడంతో ఒక పెద్దాయన దాని గురించి ప్రస్తావన తీసుకొచ్చి మరింత ఉధృతం అయ్యేలా చేశారు. ఈ విషయాన్ని అప్పటి మీడియా కూడా బాగా పాపులర్ చేసింది. ఆ పెద్దాయన సమక్షంలో తునిలో కాపు గర్జనకై ఒక బహిరంగ సభ జరిగింది. ఈ సభకు అప్పటి కాపు యువత హాజరు కాకపోతే మమ్మల్ని కాపుద్రోహులుగా చిత్రీకరిస్తారేమో అని అనుమానంతో అయిష్టంగా ఆ సభకు హాజరు అయ్యారు. ఈ సభను అప్పటి ప్రతిపక్ష పార్టీలోని నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి దీనికి సూత్రధారి అని ఆరోపణలు వచ్చినా వాటిని పట్టించుకొనే స్థితిలో కాపు ప్రజలు లేరు. ఆ తుని సభ మొదలైన కొన్ని నిమిషాల్లోనే పక్కనే ఉన్న తుని రైల్వే స్టేషన్ లో ఉన్న ఒక రైలు హఠాత్తుగా తగలబడడం జరిగింది. దీనికి కారణం ఎవరో ఇంతవరకూ నిర్ధారణ కాలేదు. అసలైన కారకులు ఎవరో ఆ దుర్గమ్మకే ఎరుక. చాలా మంది కాపు యువతపై అప్పటి ప్రభుత్వం కేసులు పెట్టి వేధించింది. ఈ పరిణామాల తర్వాత ప్రభుత్వం మంజునాథ కమీటీ ఏర్పాటు చేసింది. అలాగే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, మొదటి విడత నిధులు విడుదల చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత జరిగిన కిర్లంపూడి సంఘటనలు కూడా గుర్తుండిపోయేవే. మంజునాథ కమిటీ కాపుల కమిటీ అనగానే, పలు విమర్శలు బీసీ సంఘాలు తెలియజేసిన మీదట, దానిని బీసీ జనగణన అని చెప్పడం జరిగింది. చివరకు మంజునాథ కమీటీ సదరు రిపోర్ట్ ఇవ్వకుండానే, ఛైర్మన్ సంతకం లేకుండా కేవలం సభ్యుల సంతకాలు తీసుకొని, అప్పటి ప్రభుత్వం క్యాబినెట్లో చర్చించింది. ఆ చర్చించిన బిల్లును అసెంబ్లీలో తీర్మానం పెట్టి, ఆ బిల్లును ఆమోదం చేసి కేంద్ర ప్రభుత్వానికి సదరు తీర్మానం కాపీ అనగా బీసీ-ఎఫ్ పరిశీలించండి అని అప్పటి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. దీనిని గమనించిన జనసేన నాయకులు కొందరు ఆ పెద్దాయనకు అది చట్టబద్ధంగా చెల్లదని వారించినా ఫలితం లేకుండా పోయింది. పైగా ఆ పెద్దాయన ప్రశ్నిస్తున్న జనసేన నాయకుల గొంతును నొక్కేయడం విశేషం. ఆ కమిటీకి ఛైర్మన్ సంతకం లేనిదే చట్టబద్దంగా చెల్లదని జనసేన లీగల్ సెల్ వారు బహిరంగంగా వారించినా ఎవరు పట్టించుకొన్న పాపానపోలేదు. అలా మొదటి సారి అప్పటి ప్రభుత్వం, ఆ పెద్దాయన కాపుజాతికి మోసం చేశారు. కాలక్రమేణా కాపు కార్పొరేషన్ నిధులు సక్రమంగా విడుదల కాకపోవడం, విడుదల అయ్యే అరకొర నిధులు కూడా సరైన అర్హులకి అందకపోవడం, ఆ నిధుల చుట్టూ స్వార్థపరమైన నాయకులు వాలడం కాపు కార్పొరేషన్ మరింత క్షీణించసాగింది. అప్పటి ప్రభుత్వాలకు అనుగుణ జాడలోనే ఇప్పటి ప్రభుత్వం కూడా ఆ నిధుల చుట్టూ బెల్లం మీద ఈగల్లా చేరడం మరింత బాధాకరం.
ఎన్నికలు సమీపిస్తుండటంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం వారు 10% ఉన్నత వర్గాలలో ఆర్థికంగా బలహీనత కలిగిన వారికి విద్యా, ఉపాధి దేశమంతటా EWS చట్టం కింద ఇవ్వటంతో, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మరో మోసానికి తెర లేపారు. కాపులకు 5%, కాపేతర ఆగ్ర కులాలకు 5% రిజర్వేషన్లు చొప్పున అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆమోదింపచేసి మరలా కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపారు. వీటికి కూడా చట్టబద్ధత ఉండదని అందరికీ తెలుసు. నాటి జనసేన నాయకులు అప్పటి ప్రభుత్వాన్ని, ఆ పెద్దాయనను హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విధంగా మరోమారు కాపులకు మరోసారి మోసం చేశారు. ఈ పరిస్థితి వలన ఇపుడు కాపులకు బీసీ హోదా ఇవ్వాలా, లేక అగ్రవర్ణ స్థాయిలో నుంచి 5% రిజర్వేషన్లు ఇవ్వాలా అనే మీమాంస ఎదురయ్యి ఎటుకాకుండా కేంద్ర ప్రభుత్వం దగ్గర అలాగే మూలన పడి ఉన్నాయి.
అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రతి యేటా కాపు కార్పొరేషన్ కి రూ.2000 వేల కోట్ల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ అమలు కాలేదని మన కళ్ల ముందు అర్థం అవుతోంది. ఇచ్చిన కాపు కార్పొరేషన్ నిధుల్లో కూడా రూ.500 కోట్లు ఇతర పథకానికి మళ్లింపు జరిగినా సొంత పార్టీ వారు కానీ, ప్రతిపక్ష పార్టీ కాపు ప్రజాప్రతినిధులు గాని నోరెత్తకపోవడం విశేషం. ఈ విషయమై జనసేన పార్టీ కాపు కార్పొరేషన్ మీద శ్వేత పత్రం విడుదల చేయమని బహిరంగంగా ప్రభుత్వాన్ని ఆదేశించినా ఎటువంటి ప్రయోజనం లేదు. అసలు కాపులకు కావాల్సింది హక్కుగా వచ్చే రాజ్యాధికారమా? లేకా బిచ్చంగా వచ్చే రిజర్వేషన్లా ? ఆలోచించాల్సింది కాపు జాతి వారే .
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com