మదనపల్లి ( జనస్వరం ) : చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత పత్రికా ముఖంగా మాట్లాడుతూ రాష్ట్రంలో రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. అయితే పంటల బీమా చెల్లింపులు వారి వాటా ఎంత అనే విషయమై స్పష్టత లేదన్నారు. కొందరికి పంట నష్టం లక్షల్లో జరిగింది. అయినా ప్రభుత్వం వారిని పట్టించుకోలేదని కౌలు రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. రాయలసీమ జిల్లాలో గత ఏడాది వేరుశనగ రైతులు భారీ వర్షాల వల్ల పెద్ద ఎత్తున నష్టపోయారు. ఎకరాకు క్వింటాలు కూడా దిగుబడి రాలేదు. ఈ పంట సాగుకు ఎకరాకు 30 వేల పైన పెట్టుబడి అవుతుంది. ప్రభుత్వం పంటల బీమా పథకం కింద సగటున 2,674 రూపాయలు మాత్రమే ఇచ్చింది. పేరుకే ఉచిత పంటల బీమా ప్రధాన పంట సాగు దారులకు అరకొర పరిహారము దక్కింది. ఇక కౌలు రైతుల కు అందిన సాయం ఎంత అనేది ప్రశ్నార్థకమే. బీమా చెల్లింపు వ్యవహారమంతా ప్రభుత్వం చేతిలోనే వున్న నష్టపోయిన వారికి న్యాయం జరగలేదని అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. రెండేళ్లుగా ప్రభుత్వం ఉచిత పంటల బీమా అమలు చేస్తున్న గత ఏడాది నల్ల తామర తీవ్రంగా రైతులు నష్టపోయారు. వైరస్ వ్యాధులు కూడా దెబ్బ తీసింది. కారణంగా నష్టం కావడంతో వాతావరణ ఆధారిత బీమా కింద పరిహారం చెల్లించామన్నది అధికారుల వాదన అని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో ఎంత నష్టపోయారు ఎంత భీమా మంజూరు చేశారు, అనే అంశాలను ప్రదర్శించాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com