Logo
Date of Publish : 05 February 2022, 2:44 pm
Editor : Sake Naresh

ఓట్లు వేసి ఇంట్లో ఎలా కూర్చుంటారు, నిలదీయాల్సిన బాధ్యత మీకు లేదా? జనసేన నాయకులు తెర్నేకల్ వెంకప్ప

    ఆలూరు, (జనస్వరం) :  ఓట్లు వేసి ఇంట్లో ఎలా కూర్చుంటారు, నిలదీయాల్సిన బాధ్యత మీకు లేదా అని చిప్పగిరి మండలం నేమకల్లు గ్రామ ప్రజలతో కర్నూల్ జిల్లా ఆలూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు శ్రీ తెర్నేకల్ వెంకప్ప సమావేశం నిర్వహించారు. రోడ్లు, సిసి రోడ్లు (రంపురయ్య విధి) , త్రాగునీరు సమస్యల పైన నేమకల్లు ప్రజలతో చర్చించారు. ఇంతవరకు ఒక్క పని కూడా జరగలేదు అని అక్కడున్న పెద్దలు మరియు మహిళలు చెప్పారు. నవరత్నాలు దేవుడెరుగు ముందు మౌలికసదుపాయాల మీద దృష్టి సారించండి. వైయస్సార్ సిపి ప్రభుత్వంలో ఏ సర్పంచ్ సంతోషంగా లేడు. గ్రామాల్లో కాంక్రీట్ రోడ్లు వేయడానికి సర్పంచులు మరియు అధికారులు భయపడుతుంటే (బిల్లులు ఎక్కడ కాలగర్భంలో కలిసి పోతాయని) అలాంటిది ప్రాజెక్టులు కడతారా? గ్రామానికి వచ్చే నిధులు కూడా మీరు ఓట్ల రాజకీయం కోసం మళ్లిస్తున్నారు. గ్రామల అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా అని అన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com