వాలంటీర్లకు ఇళ్ళ పట్టాలు ఎలా ఇస్తారు ? : నర్సీపట్నం ఇంచార్జ్ రాజాన వీరసూర్య చంద్ర

              వాలంటీర్లకు ఇళ్ళ పట్టాలు ఎంత వరకూ సమంజసమని జనసేన పార్టీ నర్సిపట్నం నియోజకవర్గ ఇంచార్జ్ రాజాన వీర సూర్యచంద్ర ఆరోపించారు. నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులని చెప్పి వారికి ఎలా ఇళ్ళ పట్టాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.  ఇళ్ళ స్థలాల ఎంపికలో భారీ అవినీతి చోటు చేసుకుందన్నారు. ఎక్కువ శాతం అర్హుల జాబితాలో వాలంటీర్స్ కు చోటు కల్పించారని, అంటే కాకుండా ఇంటి పన్ను కడుతున్న వారి పేరు కూడా అర్హుల జాబితాల పేరులో ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారి పేర్లు కూడా ఉన్నాయన్నారు. అంటే కాకుండా అణగారిన వర్గాలైన ఎస్సీ  వర్గానికి చెందిన వారికి ఇవ్వకుండా స్థానిక వైసీపీ నాయకుల ఒత్తిడి తీసుకువచ్చి కనీస విచారణ చేయకుండా గ్రామసభ పెట్టకుండా గ్రామ సభ కూడా పెట్టకుండా అర్హులని ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. వాలంటీర్ ద్వారా డబ్బులు అడుగున పరిస్థితి ఉందన్నారు. ముఖ్యంగా నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామంలో ఈ దందా ఎక్కువ నడుస్తుందన్నారు. మా పేరు ఎందుకు తొలగించారని అడిగితే మీకు దిక్కు ఉన్న చోట సమాధానం చెప్పుకొండని సమాధానం ఇస్తున్న రెవెన్యూ అధికారులపై తక్షణం విచారణ జరిపాలన్నారు. అలాగే ఆ గ్రామంలో అనర్హుల జాబితా తొలగించి, అర్హులైన జాబితా వారికి ఇళ్ళు పట్టాలని ఇవాలని కోరారు. అంతేకాకుండా ఫ్యాక్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తున్నాము విచారణ చేయని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నర్సీపట్నం గ్రామీణ అధ్యక్షుడు :ఊడి చక్రవర్తి . మోపాడ చిరంజీవి. పరవాడ లోవరాజు .ఇన్న రామచంద్ర పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way