శింగనమల, (జనస్వరం) : శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం AP హౌసింగ్ డిపార్ట్మెంట్ సిబ్బంది AE, వర్క్ ఇన్స్పెక్టర్ గత 7సంవత్సరాలుగా అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా జగనన్న కాలనీలలో ఇష్టానుసారంగా మార్కింగ్ ఇష్టమొచ్చిన వారికి బిల్లులు మంజూరు చేస్తూ నిస్సహాయులైన ఒంటరి మహిళలు, వృద్ధులు, నిరుపేదలకు హౌసింగ్ సిబ్బందిని బ్రతిమాలుకుంటున్న అహంకారం ధోరణితో రాచరికం పద్ధతితో ప్రజలను పురుగులుగా హీనంగా చూస్తూ 600 మంది లబ్దిదారులను రద్దు చేస్తున్నామని తెలిపారు. ఇదే విధంగా నియోజకవర్గ పరిధిలో 6మండలాల్లో కలిపి 3వేల మందికి పైగా నిరుపేద లబ్దిదారులకు జగనన్న ఇల్లు రద్దు చేయడం జరుగుతుంది అని జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు సాకే మురళీకృష్ణ ఆవేదన వ్యక్తపరిచారు. ఇల్లు లేని పేదవారికి ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఇల్లు కట్టుకొనివారికి ఇల్లు రద్దు చేయమని ప్రభుత్వం G.O వచ్చిందని నెపంతో అధికారులు చేతివాటం, లంచాలు ప్రదర్శిస్తున్నారు. మరి ముఖ్యంగా BKS మండలంలో ఏళ్లుగా పాతకపోయిన ఒక మహిళ వర్క్ ఇన్స్పెక్టర్ గత ప్రభుత్వం హయాంలో లంచాలు మరిగి ఏకపక్షంగా BKS కాలనిలలో ప్రవర్తిస్తుంది. ఆమెపై హౌసింగ్ AE పై ప్రజలను పీడించి అవమానాలకు భయాందోళనకు గురి చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాలు అన్ని తెలిసిన MPDO మండల అధికారిణి కూడా బాధ్యత మరిచి నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తుంది. కనుక వీరందరిపై శాఖాపరమైన చర్యలు తీసుకొని ప్రజలకు, లబ్దిదారులకు న్యాయం చేయవలెనని జిల్లా అధికారులకు జనసేనపార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాము. న్యాయం చేయలేని పక్షంలో 3వేల మంది లబ్దిదారులతో కలెక్టరేట్ ను ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామని తెలిపారు.