జగ్గ౦పేట ( జనస్వరం ) : జనసేన పార్టీ అద్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జగ్గంపేట నియోజకవర్గంలో ప్రారంభించిన జనం కోసం జనసేన మహాయజ్ఞం 663వ రోజు కార్యక్రమంలో గోకవరం పట్టణంలో పర్యటించిన జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి దేవిసూర్యచంద్ర. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోనీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఈ జనం కోసం జనసేన అనే మహాయజ్ఞం ద్వారా ఇప్పటికే చాలా ప్రజా సమస్యలకు పరిష్కారం చేసి నియోజకవర్గంలోని నిరు పేదలకు సహాయం చేశాం అని అన్నారు. నేడు మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకుని వచ్చిన ఎంతో మంది స్వాతంత్ర్య సమర యోధులలో ముఖ్యులు బోసి నవ్వుల బాపూజీ మహాత్మా గాంధీ గారి జయంతి. ఈ సందర్భంగా గోకవరంలో ప్రతి ఇంటికి తిరుగుతూ ఇందిరమ్మ మోడల్ కాలనీకి రావడం జరిగింది. కానీ ఇక్కడ వీరు నివసిస్తున్న ప్రదేశం చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపించింది. 1997 వ సంవత్సరంలో ప్రభుత్వం ఇక్కడ 530 మందికి ఇందిరమ్మ మోడల్ కాలనీ పేరు మీద నివాస యోగ్యమైన స్థలాలు కేటాయించడం జరిగింది. ఇళ్ల స్థలాలు కేటాయించి 26 సంవత్సరాలు దాటుతున్నా కానీ కనీసం వారి ఇంటికి వారు వెళ్ళడానికి కూడా ఒక చిన్న దారి కూడా లేకపోవడం గమనార్హం. వీరి ఇళ్ల మధ్య రోడ్డు లేకపోవడం వలన మురుగు నీరు ప్రవహించే మార్గం కూడా లేక నీరు నిల్వ ఉండిపోవడం వలన దోమలు కూడా ఎక్కువై రకరకాల జబ్బులు కూడా వస్తున్నాయని కాలనీ వాసులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, ప్రభుత్వ అధికారులు నేరుగా వచ్చి ఇక్కడ నివసిస్తున్న వారి కుటుంబాల పరిస్థితిని కళ్ళారా చూసి వెంటనే వాళ్ల ఇళ్లకు వెళ్లే విధంగా కనీసం ఒక మట్టి రోడ్డు అయినా నిర్మించాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేయడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com