Logo
Date of Publish : 05 November 2022, 4:26 pm
Editor : Sake Naresh

ఇళ్ల పట్టాలిచ్చారు – ఇల్లు నిర్మించి ఇవ్వరా? అరకు జనసేన నాయకులు

      అరకు, (జనస్వరం) :  అరకు నియోజకవర్గం మాదల పంచాయతీ పరిధిలో గల ముసిరిగూడ గ్రామంలో జనసేన పార్టీ నాయకులు సాయిబాబా దురియా, మాదల శ్రీరాములు, అల్లంగి రామకృష్ణ, మత్స్యరాజు తదితరుల ఆధ్వర్యంలో ఆయా గ్రామంలో పర్యటించి, గ్రామస్తులతో సమావేశమై గ్రామంలో నెలకొన్న సమస్యల మీద చర్చించడం జరిగినది. ఈ సమావేశంలో జనసేన మాటలు - జనసేన సిద్ధాంతాలు గిరిజనుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆ యొక్క గ్రామంలో వైయస్సార్ ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చి నేటి వరకు ఇల్లు నిర్మించకుండా ఈ ప్రభుత్వం చేతులు దులుపుకుందని తెలిపారు. దీనిపై స్పందించిన జనసేనపార్టీ నాయకులు సాయిబాబా దురియా, మాదల శ్రీరాములు, రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే గిరిజనులకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని, ఇళ్ల పట్టాలిచ్చి జగన్ రెడ్డి నాయకత్వంలో ఇల్లు నిర్మించి ఇవ్వకుండా చేతులు దులిపేసుకున్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తి మాట్లాడారు. ఇప్పటికైనా ప్రభుత్వం గిరిజనుల పట్ల చిత్తశుద్ధితో సమస్యల పట్ల దృష్టి కారించి సమస్యలను వేగవంతంగా పరిష్కరించేలా కృషి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని జగన్ రెడ్డి ప్రభుత్వానికి గద్దె దించడానికి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కదలిరావాలని, ఈ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, జనసైనికులు రాజు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com