
మదనపల్లి ( జనస్వరం ) : జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ప్రచారం 47 వ రోజు చిత్తూర్ బస్టాండు సిటిఎం రోడ్ నందు చేయడం జరిగింది. చిల్లర వ్యాపారస్తులు అదే విధంగా చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాన్ని గడుపుతున్న ఎంతోమంది తమ యొక్క ఇబ్బందులను స్వయంగా జనసేన నాయకులతో చెప్పుకొన్నారు. ఉమ్మడి అభ్యర్థులు ఈసారీ మదనపల్లిలో గెలవడం ఖాయం అని రాబోయేది జనసేన టిడిపి ఉమ్మడి ప్రభుత్వమేయమని ముక్త కంఠంతో స్వయంగా చెప్పడం గమనించాల్సిన విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత, మదనపల్లి పట్టణ అధ్యక్షులు నాయిని జగదీష్ బాబు, మాజీ రెవెన్యూ ఆఫీసర్ బేల్దారి గోపాల్, మదనపల్లి జనసేన నాయకులు రూప, సిద్ధు,రమేష్, ధరణి, జనసేన సోను కుప్పాల శంకర లక్ష్మి పతి, నవాజ్, శేఖర్, బహదూర్ తదితరులు పాల్గొన్నారు.