Logo
Date of Publish : 12 February 2026, 5:44 pm
Editor : Sake Naresh

పెదకాకాని దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులకు సత్కారం : ఉప్పు వెంకటరత్తయ్య

పెదకాకాని, ఫిబ్రవరి 11, (జనస్వరం) : పెదకాకానిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ గంగా భ్రమరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులుగా నియమితులై ప్రమాణ స్వీకారం చేసిన వారికి జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య అభినందనలు తెలిపారు. పోన్నూరుకు చెందిన చేబ్రోలు వెంకట భాస్కర్ పున్నారావు, పెదకాకానికి చెందిన బండారు మల్లేశ్వరి, గుంటూరుకు చెందిన వరికూటి వీరసుధాకర్‌లను దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భక్తులకు అన్ని రకాల సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రానున్న మహాశివరాత్రి పర్వదినాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని, అధికారులు మరియు దేవస్థానం అర్చకులతో సమన్వయం చేసుకుంటూ పరిపాలన సాగించాలని పేర్కొన్నారు. నూతనంగా నియమితులైన ధర్మకర్తల మండలి అధ్యక్షుడు మరియు కార్యవర్గ సభ్యులు దేవస్థాన అభివృద్ధికి కృషి చేసి పాలక మండలికి మంచి పేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు యర్రగోపుల జయదీప్, మైలా బుజ్జి, హరి, సుబ్బారావు, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com