ఎచ్ఛర్ల ( జనస్వరం ) : జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ఎచ్చెర్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు అధ్యక్షులును నియమించిన విషయం మీకు తెలిసిందే. నూతనంగా నియమించిన మండల అధ్యక్షులకు ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు కాంతి శ్రీ గారి అధ్యక్షతన మరియు రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ వైస్ ప్రెసిడెంట్ విశ్వక్షేణ్ గారి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. కాంతి శ్రీ గారు మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి మండల అధ్యక్షులు కృషి చేయాలని దానికి పూర్తి సహకారం అందిస్తామని తెలియజేశారు. అలాగే విశ్వక్షేన్ గారు మాట్లాడుతూ నియోజకవర్గంలో సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలు కృషి చేయాలని కోరారు. గోవిందరెడ్డి గారు మాట్లాడుతూ జనసైనికులు అందరూ కలిసి పనిచేయాలని దానికి తన పూర్తి సహకారం అందిస్తామని తెలియజేశారు. జి.సిగడాం మండల ప్రెసిడెంట్ మీసాల రవి గారు మాట్లాడుతూ సమస్యలు సాధనే లక్ష్యం గా పనిచేయాలని, ప్రతి గడపకు మన జనసేన సిద్ధాంతాలను తెలియ చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి.సిగడాం మండల అధ్యక్షులు మీసాల రవి గారికి, రణస్థలం మండలం అధ్యక్షులు బస్వ గోవిందరెడ్డి గారికి, ఎచ్చెర్ల నియోజకవర్గం ఐటీ విభాగం కో-ఆర్డినేటర్ గొర్లె రాంబాబు గారికి, రణస్థలం మండల నాయకులు గొర్లె సూర్య మరియు అప్పన్న గారి టీంకు సన్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో వడ్డాది శ్రీనివాసరావు గారు, బాలరాం గారు, ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు మరియు జనసైనికులు అందరూ పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com