Logo
Date of Publish : 01 March 2021, 3:44 pm
Editor : Sake Naresh

ఇంటికే రేషన్ అందించాలి : ఎమ్మిగనూరు జనసేనపార్టీ నాయకులు

        రేషన్ ఇంటింటికి అందిస్తామన్న ప్రభుత్వ వాగ్దానాన్ని సక్రమంగా అమలు చేయాలని జనసేనపార్టీ నియోజకవర్గ మీడియా ఇంచార్జి గానిగ బాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రమైన గోనెగండ్లలో ఆదివారం రోజు ఫిబ్రవరి నెల చివరిరోజు కావడంతో గత నెల రేషన్ సరుకులు వచ్చేనెల మార్చిలో రెండు నెలలకు సంబంధించిన రేషన్ ఇవ్వరని రోజు వారి కూలి పనులు విడిచి రేషన్ షాపుల ముందు బారులు తీరారని తెలిపారు. ఇంటింటికి రేషన్ అందిస్తామని ప్రారంభించిన పథకం తీవ్ర గందరగోళనికి దారి తీయడంతో రేషన్ పంపిణీ సక్రమంగా జరగలేదని అన్నారు. ఇంటింటికి రేషన్ కాకుండా రోడ్లపై వాహనాలు ఉంచి నడిరోడ్డుపై నిలబెట్టి రేషన్ అందించే పద్ధతి ఏర్పడిందని పనులు మానుకొని రేషన్ కోసం రోజులు తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.  ఫిబ్రవరి నెలలో రేషన్ అందని వారిని గుర్తించి రెండు నెలలకు ఇవ్వాల్సిన రేషన్ మార్చి నెలలో పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com