Logo
Date of Publish : 03 September 2021, 2:57 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా పలుకార్యక్రమాలు నిర్వహించిన హిందూపురం జనసేన నాయకులు

       హిందూపురము, (జనస్వరం)  :  జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా హిందూపురం నియోజకవర్గం వ్యాప్తంగా హిందూపురం జనసేన పార్టీ ఇంఛార్జ్ ఆకుల ఉమేష్ గారి ఆధ్వర్యంలో జనసేన నాయకులు, కార్యకర్తలు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం చిన్నమార్కెట్ లో భవన నిర్మాణ కార్మికులకు అన్నదానం, శ్రీనివాసనగర్ వేంకటేశ్వర స్వామి గుడిలో అర్చన, ముద్దిరెడ్డిపల్లి వృద్ధాశ్రమంలో నిత్యావసర సరుకుల పంపిణీ, కొల్లకుంట వృద్ధాశ్రమంలో అన్నదానం, మొక్కలు నాటి, ఆంజనేయస్వామి దేవస్థానం పూజా కార్యక్రమాలు నిర్వహించి, కొట్నూర్ లోని ప్రాథమిక పాఠశాలకు cpu అందించి విద్యార్థులకు కావలసిన వస్తువులను అందించడం, కొట్నూర్ లో అనాధాశ్రమంలో అన్నదానం చౌడేశ్వరి కాలనీలో ఇటీవలే గాయపడిన జనసేన కార్యకర్తకు 10 వేలు ఆర్థికసాయం, గురునాథ్ టియేటర్ నందు పెద్దఎత్తున జన్మదిన వేడుకలు, శ్రీనివాస టాకీస్ వెనక వృద్ధాశ్రమంలో అన్నదానం, పరిగి బస్టాండ్ లో పెద్దఎత్తున అన్నదానం, వివర్స్ కాలనీలో విద్యార్థులకు ప్లేట్స్, నోట్ బుక్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో జిల్లా సహాయకార్యదర్శి కొల్లకుంట శేఖర్, మల్లెపూలమధు, చక్రవర్తి, నిమ్మకాయలరాము, లోకేష్, భాస్కర్, నాగభూషణం, విశ్వనాథ్, నవీన్, ప్రభు, మనోహర్, లింగరాజు, మౌలి, వీరమహిళ ప్రియా మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే చిలమత్తూరు మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో చిలమత్తూరులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి Lic రమణ, మండల నాయకులు చిన్నప్రవీణ్, అంజి, శివ తదితరులు పాల్గొన్నారు. లేపాక్షి మండలం బిసిలమనేపల్లిలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే కేక్ కటింగ్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో లోకేష్, నరేష్, శ్రీనివాస్ మరియు పెద్దఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com