హిందూపురం, (జనస్వరం) : ఈరోజు హిందూపురం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో లేపాక్షి మండలంలో క్రియాశీలక సభ్యత్వం చేయించుకున్న 200 మంది జనసైనికులకు హిందూపురం ఇంఛార్జ్ ఆకుల ఉమేష్ గారి చేతుల మీదుగా సభ్యత్వ నమోదు కిట్లను అందించారు. సభ్యత్వ నమోదు కిట్లలో 5 లక్షల ఇన్సూరెన్స్ బాండ్ల లతో పాటు పార్టీ గుర్తింపు కార్డ్, జనసేన పార్టీ సిద్ధాంతాలతో కూడిన బుక్ లు ఉంటాయని, గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం కోసం క్రియాశీలక సభ్యత్వం తీసుకొన్న ప్రతి జన సైనికుడు కృషి చేయాలని ఇంఛార్జ్ ఆకుల ఉమేష్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి కొల్లకుంట శేఖర్, చక్రవర్తి, లోకేష్, నరేష్, శ్రీనివాసులు, మునీర్, నాగభూషన్, C.m నరేష్, శివకుమార్, అభిలాష్, సంతోష్, బాలాజి, అఖిల్, అల్లాబకాష్, చంద్రశేఖర్, సాయి, ఓబులేసు, మరియు లేపాక్షి మండల జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.