విజయవాడ ( జనస్వరం ) : ఇంటింటికి రాబోయే జనసేన ప్రభుత్వం రెండో విడతలో భాగంగా 35 వ రోజు 55వ డివిజన్ అధ్యక్షులు సోమి. గోవింద్ ఆధ్వర్యంలో వించిపేట కొప్పుల వారి స్ట్రీట్,జండా చెట్టు సందు వద్ద నుండి ప్రారంభించి కొండ ప్రాంతంలో పర్యటిస్తూ ప్రజలను కలుస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్న జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా రాంపులు ఏర్పాటు చేయాలని, మెట్ల మార్గం బాగు చేయించాలని త్రాగునీటి పైప్ లైన్ల లీకేజీలు మరమ్మత్తులు చేయించాలని అనేకమంది మహిళలు మాకు తెలియజేయడం జరిగిందని అదేవిధంగా త్రాగునీరు కూడా సరైన సమయంలో రావడం లేదని దీనిపై అనేకసార్లు స్థానిక కార్పొరేటర్ పూర్ణచంద్రరావు గారికి ఫోన్ చేసిన స్పందించడం లేదని తాగునీటి సమస్య గురించి చెప్పుకుందాం అన్న ఆయనకు వినే ఓపిక లేదని అటువంటి కార్పొరేటర్ ని మేము ఎందుకు గెలిపించుకున్నామని స్థానికులు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అదే విధంగా మరికొంత మంది మహిళలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూడుకుపోవడం వల్ల కొండపై ప్రాంతం నుంచి వచ్చే నీరు పారుదల సరిగా లేక ఆ వాటర్ అంతా కూడా రోడ్ల మీదకు వచ్చి రోడ్లన్నీ కూడా నడవడానికి వీలు లేకుండా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూడికలు తీయించమని ఎన్నిసార్లు చెప్పుకున్న తీయించడం లేదని అదే విధంగా మరి కొంతమంది మహిళలైతే డ్వాక్రా గ్రూపుల నుండి మమ్మల్ని కావాలనే తొలగిచ్చేస్తున్నారని అదేవిధంగా మేము పొదుపు కింద దాచుకున్న డబ్బులు మా అవసరాల నిమిత్తం అడిగితే ఇవ్వడం లేదని అదే జగన్ సెంటు భూమి పథకం కింద అయితే 35 వేల రూపాయలు మా అనుమతి లేకుండానే మాకు ఇచ్చేస్తున్నారని మహిళలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అదేవిధంగా ఇంతవరకు కొండప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టినటువంటి స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు వుండి ఎందుకని మేము సూటిగా ప్రశ్నిస్తున్నామని మూడు సింహాలు కొట్టేయడానికి ప్రభుత్వ భూములు కబ్జా చేయడానికి అక్రమ నిర్మాణాలు చేయడానికి వ్యాపారస్తులను బెదిరించి డబ్బులు దండుకోవడానికి మీకు వున్న సమయం ప్రజా సమస్యలకు మాత్రం సమయం ఉండదని, స్థానిక ఎమ్మెల్యే పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిని విస్మరించారని మీలాంటి వ్యక్తికి రాబోయే రోజుల్లో ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారని గాంధీ గారి విగ్రహం కాళ్లు చేతులు లేకుండా తల, మొండెం మాత్రమే ఉంటే విఎంసి కమిషనర్ గారికి గాని మేయర్ గారికి గాని అవమానమనిపించట్లేదా అని గాంధీ గారి విగ్రహానికి మీరు ఎందుకు రక్షణ కల్పించలేకపోయారు అని గాంధీ గారి విగ్రహానికి పునర్ ప్రతిష్ఠ చేయడానికి మీరు ఎందుకు వైఫల్యం చెందారని మేము గాంధీజీ గారి విగ్రహానికి జరిగినటువంటి అవమానాన్ని బలంగా బయటకి తీసుకురావడం వల్లే కదా ఈరోజు గాంధీ గారి విగ్రహం ఎక్కడుందో బయట పెట్టారని, మహాత్మా గాంధీ గారికి జరిగిన అవమానంలో వైసీపీ వైఫల్యం స్పష్టంగా కనబడుతుందని మా మీద ఇష్టానుసారం మీరు మాట్లాడితే కుదరదని మామీద కేసులు పెట్టాలనుకుంటే పెట్టుకోండి అని మేము కూడా మీ మీద అక్రమ నిర్మాలు చేస్తున్నందుకు అవినీతి డబ్బులు దండుకున్నందుకు గాంధీ గారి విగ్రహం అవమాన పరిచినందుకు మేము కూడా మీ మీద ఎన్ని కేసులు పెట్టాలో మీరే సమాధానం చెప్పాలని మున్సిపల్ కమిషనర్ గారు గాని మేయరు గారు గాని దీనికి ఎవరు సమాధానం చెబుతారో చెప్పాలని గాంధీ గారి విగ్రహం పునర్ ప్రతిష్ట లో మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామని మా దగ్గర నుంచి కూడా సహకారం తీసుకోవాలనే అంశాన్ని లిఖిత పూర్వకంగా రేపు మేము కార్పొరేషన్ అధికారులకి అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఆకుల రవిశంకర్, మొబీనా, అల్లం నాగ రమేష్,బొబ్బూరి కొండల రావు t భరత్, స్టాలిన్ శంకర్ , కొరగంజి వెంకట రమణ ,ఏలూరు సాయి శరత్ , పొట్నూరి శ్రీనివాసరావు,రాము గుప్తా, లింగం శివ ప్రసాద్, బుట్టా సాయి, సావింగ్కార్ నరేష్, తదితరులు పాల్గొన్నారు