కోట్ల రూపాయల దోపిడీకి స్థాయి సంఘం ప్లాన్‌ : జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌

పీతల మూర్తి యాదవ్‌
  • వాకీ టాకీ కొనుగోళ్లు లో లక్షల కమీషన్‌
  • ఎజెండాలో చేర్చడానికి షాడో మేయర్‌ లకు కమీషన్‌ , ఆమోదానికి సభ్యులకు పర్సంటేజ్‌
  • అవినీతికి చిరునామా గా స్థాయి సంఘం
  • స్థాయి సంఘం నిర్ణయాలతో జీవీఎంసీకి కోట్ల రూపాయల నష్టం

       విశాఖపట్నం ( జనస్వరం ) : పలు పనుల అంచనాలు పెంచి, ఆమోదం లేకుండా చేసేసిన వాటి ఆమో దానికై కోట్లాది రూపాయలు దోచుకోవడానికి స్థాయి సంఘం సభ్యులు సిద్ధమవుతున్నారని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ ఆరోపిం చారు. మహా విశాఖ నగర పాలక సంస్థ స్థాయి సంఘం (స్టాండింగ్‌ కమిటీ) అవినీతి , అక్రమాలకు చిరునామాగా మారిందన్నారు. గతంలో షాపులు, ఆస్తుల అద్దె బకాయిలు విషయంలో బయటపడిన స్థాయి సంఘం అక్రమాల కారణంగా సంస్థ కు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని గుర్తు చేశారు. ఇప్పడు అనుమతి లేకుండా రెట్టింపు మొత్తానికి కొన్న వైర్‌ లెస్‌ సెట్లు, జగనన్న ఇళ్ల స్థలాలు సాఫ్ట్వేర్‌ రూపకల్పన, జోన్‌ లలో చెత్త తొలగింపు వాహనాలు కొనుగోలు వంటి అంశాలను స్థాయి సంఘం ఎజెండాలో చేర్చి నిబంధనలకు విరుద్ధంగా కోట్ల రూపాయలు నష్ట పోయే విధంగా ఆమోదించారని ఆరోపించారు. కౌన్సిల్‌ ఆమోదం లేకుండా పనులు, కొనుగోళ్లు జరుగుతున్న సమయంలో స్థాయి సంఘం లోని షోడో మేయర్లు లంచాల కోసం వీటిని చేర్చి ఆమోదం తెలుపుతున్నారని విమర్శించారు. మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో చెత్త తరలింపు వాహనాల కోసం జోన్‌కి కోటీ ౩0లక్షల వరకు అదనపు భారం పడు తుందని, సంఘం సభ్యుల కోసమే ఇవి జరుగుతున్నాయని ఆరోపించారు. నగర పాలకసంస్థ పై కోట్లలో అదనపు భారం వేసి ఇంత కీలకమైన అంశాలనం కౌన్సిల్‌ ఎజెండాలో చేర్చకుండా, కార్పొరేటర్ల చర్చించకుండా స్థాయి సంఘాల నిర్ణయం తీసుకోవటం నిబంధనలకు విరుద్ధమన్నారు. భారీ కుంభకోణానికి తెరలేపే ఈ అంశాలను స్థాయీ సంఘం అజెండాలో నుంచి తప్పించి నిజంగా అంచనాలను పెంచాల్సి వస్తే విస్ఫృత చర్చ కోసం కౌన్సిల్‌ ఎజెండాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు అంచనాలు పెంచే ఏ టెండర్‌ వ్యవహారమైనా కౌన్సిల్‌ లోని చర్చించే విధంగా నిబంధనలు రూపొందించాలని డిమాండ్‌ చేశారు. అధికార పార్టీ కార్పొరేటర్లు, స్థాయీ సంఘం సభ్యుల కోసమే ఈ పెంపకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. నగర ప్రజల మీద చెత్త పన్ను, ఇంటి పన్ను భారం వేసిన విశాఖ నగర పాలక సంస్థ మరోపక్క కోట్ల రూపాయలను అదనంగా, అప్పనంగా కాంట్రాక్టర్లకు దోచి పెట్టడం అనుమానాస్పదమేనన్నారు. స్థాయి సంఘం అవినీతి అక్రమాలకు చిరునామాగా మారకుండా పారదర్శక పాలనకు పెద్దపీట వేస్తారని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. కమీషనర్‌, అదనపు కమిషనర్లు, జోనల్‌ కమిషనర్లకు కొత్త వాహనాలు కొనుగోలులో భారీ కుంభకోణం జరుగుతుందని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way