నూజీవీడు ( జనస్వరం ) : తుఫాన్ బాధిత రైతులకు ఎకరానికి 25వేలు నష్టపరిహారం ఇవ్వాలని, రుణ మాఫీ చేయాలని కోరుతూ జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి & నూజివీడు నియోజకవర్గం నేత మరీదు.శివరామకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం నిరాహార దీక్ష నిర్వహించడం జరిగింది.ఈ నిరాహార దీక్ష నీ ఉద్దేశించి టిడిపి నేత నూజివీడు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కాపు శ్రీనివాసరావు మాట్లాడుతూ నియోజకవర్గం లో నాలుగు మండలాల్లో తుఫాన్ వల్ల మినుము మొక్కజొన్న మామిడి పొగాకు వరి పంటలు దెబ్బతింటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. అధికారులు నేటి కూడా క్షేత్రస్థాయి లో పంట నష్టన్ని అంచనా వేయటానికి రాలేదని అన్నారు. సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామారావు మాట్లాడుతూ రైతు కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతుంటే ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారో తెలియడం లేదు అన్నారు. ముఖ్యమంత్రి రెడ్ కార్పెట్ తో స్టేజీలు కట్టించుకుని పంట నష్టాన్ని చూడటానికి వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. ఐక్య పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. సిపిఎం పార్టీ నాయకులు జి రాజు మాట్లాడుతూ రైతులకు నష్టపరిహారం వచ్చేవరకు పోరాటం చేయాలని అన్నారు. ఉదయం నిరాహార దీక్షను మల్లవల్లి రైతు జేఏసీ నాయకులు దోనవల్లి.వెంకట్రావు , జనసేన పార్టీ నాయకులు ముత్యాల కామేష్ పూలదండలు వేసి దీక్షను ప్రారంభించారు.ఈ దీక్ష శిబిరానికి వచ్చి తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ యనమదల నాని, నూజివీడు మండల అధ్యక్షుడు యర్రంశెట్టి రాము,టౌన్ నాయకులు ముమ్మలనేని సునీల్ కుమార్, బండారు రాజు, వీరమహిళ రామిశెట్టి తేజస్విని, రంగు ధనలక్ష్మి, కారుముడి చంద్ర హర్ష, తోట బలరాం అగిరిపల్లి మండల కార్యదర్శి సువర్ణ రాజు, అగిరిపల్లి మండల కార్యదర్శి కురాకుల.ప్రసాద్, నూజివీడు మండల ప్రధాన కార్యదర్శిలు చేరుకుపల్లి కిషోర్ , కోటి,షేక్. బాజి మల్లవలి రైతు సంఘ నాయకులు మురళి, నాగమణి, సలీం.భాష, ఘని మద్దతు తెలియజేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com