
గుంటూరు, (జనస్వరం) : వైసీపీ పాలనలో నిత్యావసరాల వస్తువులపై వీరబాధుడు పథకం మాత్రం విజయవంతంగా అమలవుతోందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు గారు ఎద్దేవా చేశారు. ఆదివారం గుజ్జనగుండ్ల సెంటర్‌లో జనసేన నాయకుడు చేజర్ల శివకుమార్ ఆధ్వర్యంలో మూలధనం ఆధారిత పన్ను పెంపుపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఆయన ప్రనంగించారు. ఆస్తిపన్ను, చెత్తపన్ను వంటి నిర్ణయాలతో ప్రజలు నడ్డివిరుస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కార్పొరేటర్ వద్మావతి జనసేన నాయకులు ఆళ్ల హరి, నక్కల పంశీ, పద్మావతీ, సుంకే శ్రీనివాస్, ప్రసాద్, నాగరాజు, శిఖా బాలు, గుర్రాల కోటేశ్వరరావు, శెట్టి వెంకటేశ్వర్లు, చిమట చైతన్య తదితరులు పాల్గొన్నారు.