Logo
Date of Publish : 25 December 2025, 7:17 pm
Editor : Sake Naresh

అటల్ వాజ్‌పేయి శత జయంతికి ఘన నివాళులు

నెల్లూరు, అక్టోబర్ 25, (జనస్వరం) : భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాలను సుపరిపాలన దినోత్సవంగా ఘనంగా నిర్వహించారు. శీలం, సంయమనం, దేశభక్తిని రాజకీయాల్లో ఆచరణలో చూపిన మహనీయుడిగా వాజ్‌పేయి సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వాజ్‌పేయి జయంతి సందర్భంగా నెల్లూరు ముత్తుకూరు సర్కిల్‌లో ఉన్న ఆయన విగ్రహానికి మాలలు వేసి జనసేన నాయకులు గునుకుల కిషోర్, నూనె మల్లికార్జున యాదవ్ తదితర జనసైనికులతో కలిసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజాసేవే లక్ష్యంగా, జాతీయ ఐక్యతే మార్గదర్శకంగా వాజ్‌పేయి దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. భయరహితమైన నవనిర్మాణ భారత నిర్మాణానికి ఆయన ఇచ్చిన ప్రేరణ ప్రతి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఆ మహనీయుడికి జనసేన పార్టీ తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. అనంతరం వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీ రెడ్డి, లయన్స్ క్లబ్ యుగంధర్, సమాజసేవకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com