గంగాధర నెల్లూరు , (జనస్వరం) : గంగాధర నెల్లూరు మండలం వీరక నెల్లూరు గ్రామంలో రామనాధం (వయస్సు 49 సంవత్సరాలు) ఊపిరి తిత్తుల్లో కాన్సర్తో బాధపడుతున్నాడు. చిన్న తనంలోనే అపెండిసైటిస్ ఆపరేషన్ చేసుకున్నాడు. ఆపైన ఇప్పుడు కాన్సర్ రావడం చాలా బాధాకరమని నియోజకవర్గం ఇంఛార్జ్ యుగంధర్ పొన్న గారు ఆవేదన వ్యక్తం చేసారు. రుయా ఆసుపత్రి లో చికిత్స కుదరక ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ నానా నరక యాతన పడుతున్నారు. ఆంధ్రలో అందని ద్రాక్షగా వైద్యం మారిందని, సామాన్యుల జీవనం అస్తవ్యస్తమవుతూ ఉందని ఆగ్రహం వ్యక్తం చేసారు. తరాలు మారినా తలరాతలు మారలేదని ఎద్దేవా చేసారు. ఇదే రకంగా ఆరోగ్య వ్యవస్థ కొనసాగితే పేదల బ్రతుకులు చిద్రమవడం కాయం అని తెలిపారు. ప్రభుత్వం ప్రజలందరికి ఉచిత వైద్యం అందించి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ చేయాల్సింది పోయి అనారోగ్య ప్రదేశ్ గా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేసారు .ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయాల్సిందిగా డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం లో మండల నాయకులు వెంకటేష్, సురేష్, చంద్ర శేఖర్, ధర్మ తేజ మరియు జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com