కార్వేటినగరం, (జనస్వరం) : కార్వేటినగరం మండలం ఆర్‌కె వి వి పేట పంచాయతీ పరిధిలో ఉన్న రాజుల కండ్రిగ గ్రామంలో అన్నామలై గ్రామ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిలో పూరి గుడిసె వేసుకుని ఉంటే దానిని వెంటనే తీసేయాలని రెవెన్యూ అధికారులు, మరియు వైఎస్‌ఆర్సిపి నాయకులు చెబుతున్నారని, ఆ స్ధలాన్ని జనసేన పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు పరిశీలించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గ బాధ్యులు యుగంధర్ పొన్నాల గారు మాట్లాడుతూ గ్రామ పరిధిలో ఐదు సంవత్సరాలు క్రితం పూరి పాక వేసుకున్న అన్నామలైను రెవెన్యూ అధికారులు, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు ప్రోద్బలంతో తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇదే పంచాయతీలో కలికిరి ఇండ్లు జాతీయ రహదారి ప్రక్కన వైయస్సార్ సిపి కార్యకర్త ఇల్లు నిర్మించుకుని వ్యాపారం చేస్తున్నారన్నారు, ప్రభుత్వ స్మశానం భూమిలో బోరు వేనుకుని అనుభవిస్తున్నారు. స్మశానం స్థలంలోనే పశువుల పాక వేసుకొని పశువులదాన విక్రయిస్తున్నారని, ఇటువంటివి రెవెన్యూ అధికారులకు, వైఎస్‌ఆర్సిపి నాయకులకు కనబడడం లేదా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మండల అధ్యక్షుడు శోభన్ బాబు, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, సమన్వయకర్త నాగమణి, శరత్, శివ, అన్నామలై, యుగంధర్, రాజా బాబు, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com