విశాఖపట్నం ( జనస్వరం ) : ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అహర్నిశలు శ్రమిస్తానని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో చేపడుతున్న పవన్ అన్న ప్రజా బాట కార్యక్రమం మంగళవారం నాటితో 110వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో భాగంగా 32 వ వార్డు ఎల్లపు వారి వీధి ప్రాంతానికి చెందిన పెళ్లి కుమార్తె ఇందుకు బంగారు తాళిబొట్టు పట్టు, చీర, పసుపు కుంకుమ అందజేశారు. అనంతరం డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ప్రజాసేవకే తన జీవితం అంకితం అని చెప్పారు. తను ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానిని కచ్చితంగా అమలు చేసేంత వరకు నిద్రపోనని పేర్కొన్నారు. నియోజకవర్గంలో చేపడుతున్న పర్యటనలో ప్రజల నుంచి ఎన్నో వినతులు, విజ్ఞప్తులు వస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వం నుంచి పూర్తిగా ఎవరికి కూడా సహాయం అందడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారని చెప్పారు. అధికార పార్టీ నాయకులకు సంపాదన మీద ఉన్న ధ్యాస ప్రజల సమస్యల పరిష్కారం చేయడంలో లేదని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రతి ప్రాంతంలోనూ ప్రజల తరపున జన సైనికులు పోరాటం చేస్తున్నారని వెల్లడించారు. ప్రజల కష్ట సుఖాలలో తాను ఎప్పుడూ తోడు ఉంటానని వారికోసం ఏవైనా చేయడానికి తాను సిద్ధమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు టమాటా అప్పారావు, వర, కోదండ, శ్రీలేఖ, పరమేశ్వరి, మంగ, రత్నం, లక్ష్మి, ఉమా, దుర్గ, కుమారి, కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com