
పాతపట్నం ( జనస్వరం ) : కొత్తూరు మండలం, కాకరగుడ పంచాయితీ లో గిరిజనసేన పేరుతో ప్రతి ఇంటికి జనసేణ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి గేదెల చైతన్య, మండల అధ్యక్షులు దొంపాక జయరాజు, మండల నాయకులు మరియు కాకర గూడ పంచాయితీ ప్రజలు, జనసైనికులు కలిసి వెళ్ళి గిరిజనుల సమస్యల్ని తెల్సుకుని పరిష్కార మార్గాన్ని వివరించారు.. Sc, St నిధులు మళ్లింపు, జగనన్న కాలనీలు, తాగునీరు వసతి, రిజర్వేషన్ వంటి సమస్యల మీద మాట్లాడుతూ ఈ సమస్యల్ని కలెక్టర్ దృష్టికి ఈ నెల 14 న వివరించటం జరుగుతుందని హామీ ఇచ్చారు.