అరకు, (జనస్వరం) : అరకు వెలి మండలంలో ఈ రోజు హర్షవర్ధన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ తైక్వాండో శిక్షణ గోడ పత్రికను జనసేనపార్టీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు, కోచ్ కొర్ర బంగారాజు ఆవిష్కరించడం జరిగింది. అరకు వెలి శ్రీ వెంకటేశ్వర కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాదాల శ్రీరాములు మాట్లాడుతూ తైక్వాండో శిక్షణ తరగతులు శ్రీ వెంకటేశ్వర కల్యాణ మండపం లో రేపటి నుండి నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు కోచ్ కొర్ర బంగారాజు తెలిపారు. అదే విధంగా శిక్షణ తరగతులలో ఆత్మ రక్షణ విద్య? క్రమశిక్షణ? మర్యాదలు?ఏకాగ్రత ? ఆరోగ్య విలువలు ? నేర్పింపబడుతుందని వారు తెలిపారు. విద్యార్థులకు మార్షల్ అర్ట్స్ చాలా అవసరం గనుక అందరూ నేర్చుకోవాలి. శిక్షణ తీసుకొని ఉన్నత స్థాయిలో పేరు పొందాలని విద్యార్థులకు సూచించడం జరిగింది. విద్యార్థులుకు వ్యయమాంతో పాటు ఇలాంటి తైక్వాండో శిక్షణ తీసుకుంటే చాలా మంచిదని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు అరకు ప్రాంతంలో నిర్వహించడం అభినందనీయమని కోచ్ కొర్ర బంగారాజుని అభినందించారు. ఈ శిక్షణ తరగతులు విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలి అని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ అరకు మండల నాయకులు అల్లంగి రామకృష్ణ, కోచ్ కొర్ర బంగార్రాజు, చీఫ్ కోచ్ ప్రకాష్, గెమ్మేలి శివకుమార్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com