తిరుపతి ( జనస్వరం ) : శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జరిగిన గిరిజన నవ సమాజ్ ద్వితీయ వార్షికోత్సవ ముఖ్యఅతిథిగా పీఏసీ సభ్యులు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తల్లి తండ్రి గురువు యొక్క గొప్పతనాన్ని చెప్పారు. మనం ఈ లోకం లో ఉంటున్నాం అంటే దానికి కారకులు తల్లి తండ్రి, మనకు మంచి చెడు చెప్పే తల్లి తండ్రి అయితే, మనం మంచి మార్గం లో నడిపించే వారు గురువులు, మనం జీవితం లో అభివృద్ధి చెందాలంటే ముఖ్య కారకులైన తల్లి తండ్రి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక మంచి స్థాయిలో ఉంటున్నాం అంటే దానికి కారకులైన గురువులను మనం గుర్తుకు తెచ్చుకోవాలి. చదువుని కస్టపడి చదవటం కాదు ఇష్టంతో చదివితే మనం అనుకున్న దానికంటే గొప్పగా మనం మంచి స్థాయికి వెళ్ళగలం. మనం ఏదైనా సాధించాలి అంటే మనకు ఏది ఇష్టమో అది చేస్తు చదువుకుంటే మనం గొప్ప స్థాయికి వెళ్ళగలం. మన చేతల్లో చేయలేము అనుకున్నది చేసేవారే దైవం. లీడర్షిప్ అనేది చాలా ముఖ్యం ఈరోజు గొప్పగొప్ప నాయకులు అందరూ ఒకప్పుడు మన విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన వారే, అలాంటి నాయకులలో ఎంతోమంది ముఖ్యమంత్రులుగానో గొప్ప ఐఏఎస్ ఐపీఎస్ లు అలాంటి గొప్ప వ్యక్తులు మీ లాంటి విద్యార్థుల నుంచి వచ్చిన వారే అలాంటి మీరు ఎంతో కృషితో పట్టుదలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. ఈ సభ ఆర్గనైజ్ చేసిన విద్యార్ధి సంఘ నాయకులు మొహమ్మద్ రఫీ, శివ శంకర్ నాయక్, హరి నాయక్, సహకరించిన అందరికి అభినందనలు తెలిపిన పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ శ్రీకాంత్ రెడ్డి, మురళీధర్, మురళి మోహన్, శివశంకర్ నాయక్, హరి నాయక్, వెంకట్ నాయరణ, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అకేపాటి సుభాషిణి, జిల్లా ఉపాధ్యక్షులు బత్తిన మధు బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ యాదవ్, జిల్లా కార్యదర్శి ఆనంద్, బాటసారి, తిరుపతి నగర ఉపాధ్యక్షులు పార్ధు, కార్యదర్శులు చరణ్ రాయల్, లోకేష్, కిరణ్ కుమార్, రవి, బాలాజీ, హేమంత్, సాయి,పురుషోత్తం, పురుషోత్తం రాయల్, మనోజ్ కుమార్, గౌస్ బాషా, అర్బన్ జనసైనికులు మోహిత్,బాలాజీ, రవి తదితర నాయకులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com