పెందుర్తి ( జనస్వరం ) : 88 వార్డ్, నరవ గ్రామంలో రైతులకు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు స్థానిక నాయకులు వబ్బిన జనార్దన శ్రీకాంత్ గారు రైతులను కలిసి వారికి రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది, శ్రీకాంత్ గారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు ఈరోజు రైతులు యొక్క పొలములోకి వెళ్లి స్వయానా రైతులకు అంతర్జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని, రైతే రాజు అనే నినాదం వర్ధిల్లాలి అంటే తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపించాలని, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తన కష్టార్జితం 30 కోట్లు రూపాయలను సుమారు 3 వేలు మరణించిన కౌలు రైతుల కుటుంబాలకు ఇవ్వడం చూస్తుంటే ఆయనకు రైతుల మీద ఉన్న ప్రేమను మనమందరం గుర్తించాలని, ఈరోజు ఈ యొక్క పర్యటనలో రైతుల యొక్క కష్టాలను, రాబోయే ప్రభుత్వాలు రైతులకు ఎటువంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి అని వాటిపై తెలుసుకోవడం జరిగింది అని, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్ల ఈరోజు రైతులు యొక్క దుస్థితి ఈ విధంగా దిగజారిందని, రైతులను ఓటు వేసే యంత్రాలుగా ఈ ప్రభుత్వాలు చూసాయని, రైతు వృత్తి లాభసాటిగా ఉండి భవిష్యత్తులో యువత దీని వైపు చూసేలాగా ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని, భవిష్యత్తులో జనసేన పార్టీ రైతులపై అనుసరిస్తున్న ప్రభుత్వ విధానాలపై కూడా రైతులకు వివరించడం జరిగిందని మాట్లాడం జరిగింది. స్థానిక నాయకులు బొడ్డు నాయుడు గారు మాట్లాడుతూ ఈ రైతులందరూ కూడా మీ యొక్క ఓటును సరిగ్గా ఉపయోగించుకున్నట్లయితే రాబోయే రోజుల్లో జనసేన పార్టీని మీరు ఆశీర్వదించినట్లయితే రైతులకు మంచి భవిష్యత్తు ఇచ్చే నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ రాష్ట్రంగా అవతరిస్తుందని మీరందరూ సహకరించి జనసేన పార్టీ ప్రభుత్వ స్థాపనకు కృషి చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారాయి గాని రైతు యొక్క దుస్థితి అలాగనే ఉందని, రోజురోజుకీ రైతు కూలీలు ధరలు పెరుగుతున్నాయి, వ్యవసాయ ఉపయోగించే రసాయనాలు చెల్లె యంత్రాంగాలు అందుబాటులో లేవని, చాలామంది రైతులకు రైతు భరోసా అందడం లేదని, వ్యవసాయం చేయని వాళ్ళు కూడా రైతు భరోసా అందడం వలన మేము చాలా నష్టపోతున్నామని, భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారికి సహకరిస్తామని చెప్పడం జరిగింది, ఈ యొక్క కార్యక్రమంలో గవర శీను, ప్రసాద్, రామ్ మరియు జన సైనికులు పాల్గొన్నారు.